Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభిమానులకు పవర్ స్టార్ బర్త్‌డే గిఫ్ట్.. సెప్టెంబర్ 1 అర్థరాత్రి 'సర్దార్' టీజర్

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2015 (12:28 IST)
సెప్టెంబర్ రెండో తేదీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ఆ రోజున తన అభిమానులకు మరిచిపోలేని బహుమతిని ఇచ్చేందుకు పవన్ ప్లాన్ చేస్తున్నాడట. స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా అభిమానులకు పవన్ ఓ గిఫ్ట్‌ను ఇచ్చిన విషయం తెల్సిందే. అదే తాను నటిస్తున్న కొత్త చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్'.
 
 
అలాగే, తన పుట్టిన రోజున అభిమానులకు ఓ గిఫ్ట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాడట. తన పుట్టినరోజు కానుకగా, 'సర్దార్ గబ్బర్ సింగ్' ఈ మూవీ టీజర్ రిలీజ్ కానుంది. సెప్టెంబ‌రు ఒకటో తేదీ అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు ఈ టీజ‌ర్‌ని ఆన్‌లైన్‌లో విడుదల చేయబోతున్నట్టు సమాచారం.
 
మరోవైపు... పవన్ వీరాభిమాన బాబా సెహగల్. ఇప్పటికే 'కరో కరో జల్సా' అంటూ పవన్ అభిమానులను ఉర్రూతలూగించాడు. ఆ మధ్య పవనిజం అంటూ ఓ పాప్ సాంగ్‌తో అదరగొట్టారు. అలాగే, పవన్ బర్త్ డే సందర్భంగా తాజాగా మరో సాంగ్ సిద్ధం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. పవర్ ఓ పవర్ స్టార్ పల్లవితో సాగే ఈ పాటకు తానే సంగీతం సమకూర్చి బాబా సెహగల్ పాడగా... శ్యామ్ కాసర్ల సాహిత్యాన్ని సమకూర్చాడు. 
 
మరోవైపు వరుణ్ తేజ్‌ కూడా బాబాయికి వరుణ్ తేజ్ 'కంచె' రూపంలో బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వనున్నాడు. పవన్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్-2న ఈ "కంచె" మూవీ థియేట్రికల్ ట్రైలర్ విడుదల కాబోతోందట. మొన్నామద్య విడుదలైన 'కంచె' సినిమా టీజర్ తనకు ఎంతగానో నచ్చినట్టు.. పవన్ ఇప్పటికే కొనియాడాడు కూడా. టీజర్‌ను ప్రశంసించిన పవన్... ట్రైలర్‌కు కూడా ఆశీస్సులు అందిస్తాడనే హోప్‌తో ఉన్నారు చిత్ర యూనిట్. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments