Webdunia - Bharat's app for daily news and videos

Install App

సప్తగిరి మరో బండ్ల గణేశా? : మెగా ఫ్యామిలీ భజనలో తరించిపోతున్నాడా? (Video)

కమెడియన్ నుంచి హీరో స్థాయికి ఎదిగిన నటుడు సప్తగిరి. 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' పేరుతో వెండితెర ప్రేక్షకుల మందుకు రానున్నాడు. అయితే, ఈ కమెడియన్ కమ్ హీరో మరో బండ్ల గణేష్‌లా మారిపోయాడనే ప్రచారం టాలీవుడ్‌లో

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2016 (18:23 IST)
కమెడియన్ నుంచి హీరో స్థాయికి ఎదిగిన నటుడు సప్తగిరి. 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' పేరుతో వెండితెర ప్రేక్షకుల మందుకు రానున్నాడు. అయితే, ఈ కమెడియన్ కమ్ హీరో మరో బండ్ల గణేష్‌లా మారిపోయాడనే ప్రచారం టాలీవుడ్‌లో జోరుగా సాగుతోంది. పొద్దస్తమానం మెగా ఫ్యామిలీ భజనలో తరించిపోతుండటమే ఇందుకు నిదర్శనం. 
 
నిజానికి బండ్ల గణేష్ కూడా చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఆ తర్వాత సూపర్ హిట్ చిత్రాలు తీసే బడా నిర్మాతగా ఎదిగిపోయారు. మంచి పేరు గడించాడు. అలాగే, ఒక మెగా అభిమానిగా కూడా మంచి పేరు కొట్టేశాడు. దానికి కారణం ఎక్కడపడితే అక్కడ అటు చిరంజీవి, ఇటు పవన్‌ని మార్చిమార్చి పొగిడేస్తుండటమే. ఎంతోమంది హీరోలు, నటులు, దర్శకనిర్మాతలు ఈ మెగా హీరోలను పొగిడినా బండ్ల గణేశ్‌ని మించి పోలేక పోయారు.
 
ఇపుడు ఇదే కోవలోకి సప్తగిరి కూడా చేరిపోయాడు. 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌'‌తో హీరోగా వస్తున్న ఈ హీరో చిరంజీవి, పవన్ కల్యాణ్‌ని పొగిడిన తీరు చూస్తే మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే. ఇటీవల 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' సినిమా ఆడియో ఫంక్షన్‌కు పవన్ హాజరుకావడంతో ఆ కార్యక్రమాన్ని వేదికగా చేసుకొని చెలరేగిపోయాడు. ఆ ఆడియో విడుదల కార్యక్రమంలో సప్తగిరి ఏం మాట్లాడాడంటే... 
 
ఆ వివరాలేంటంటే.. ‘నాజీవితంలో ఎందుకింత మంచి రోజు జరిగిందంటే.. నేను పుట్టినప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవిని చూస్తూ పెరిగాను. ఆయన్ను అభిమానిస్తూ పెరిగాను. ఆయన్ను ఆరాధిస్తూ పెరిగాను. నా మనసుతో మెగాస్టార్ చిరంజీవి గారితో లక్షసార్లు మాట్లాడాను. నేను ఇంత నిజాయితీ పరుడైన మెగా అభిమానిని కాబట్టే ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నా ఆడియో ఫంక్షన్‌కు వచ్చారు’ అని చెప్పాడు. 
 
ఇక పవన్ కల్యాణ్ గురించి కూడా ఆయన మాట్లాడారు. ‘సార్... నేను మీకు మాటల్లో చెప్పుకోలేంత రుణపడిపోయాను సార్. మీరు అక్కడ కూర్చుని చిన్నపిల్లాడిలా నవ్వుతుంటే నా మనసు మొత్తం పవర్ స్టార్ ఆవహించేసాడు. ఆయన సినిమాల్లో ఓ కుర్రాడిలా కనిపిస్తాడు. సడెన్‌గా ఎవరికో హెల్ప్ చేస్తూ గడ్డం పెంచి వైట్ అండ్ వైట్‌తో మర్యాదస్తుడైన యోగిలా కనపడతాడు. రాజకీయ వేదికపై చూస్తే.. చరిత్ర సృష్టించాల్సిన వ్యక్తిలా కనిపిస్తాడు. చరిత్ర సృష్టించాల్సిన వ్యక్తుల గురించి పుస్తకాల్లో చదవడమే. ఇంతవరకూ ఎవరినీ చూడలేదు. చరిత్ర సృష్టించిన వ్యక్తులు ఎలా ఉంటారో పవర్‌స్టార్‌ని చూస్తే అర్థమవుతోంది. ఈ రోజు భవిష్యత్తులో ఎన్నో గొప్ప సంచలనాలను, ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చే, ఒక చరిత్ర సృష్టించే వ్యక్తి ఈ రోజు మన వెనుక నిలబడ్డాడు. నిజంగా నా మనసు మొత్తం పవర్ స్టార్ గారు ఆవహించి ఉన్నారు’ అని చెప్పుకొచ్చాడు ఈ వర్ధమాన హీరో. 

 

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments