Webdunia - Bharat's app for daily news and videos

Install App

Saptagiri : పెళ్లి కాని ప్రసా'ద్ గా సప్తగిరి ఫస్ట్ లుక్

దేవి
సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (14:01 IST)
Saptagiri
సప్తగిరి హీరోగా అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వంలో ఓ అవుట్-అండ్-అవుట్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. ఈ చిత్రాన్ని విజన్ గ్రూప్ కు చెందిన కె.వై. బాబు, థామ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి నిర్మిస్తున్నారు. చాగంటి సినిమాటిక్ వరల్డ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) విడుదల చేస్తుంది.
 
టైటిల్, ఫస్ట్ లుక్ తో సహా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అప్‌డేట్‌లను మేకర్స్ రివిల్ చేశారు. ఈ సినిమా పెళ్లి కాని ప్రసాద్ అనే టైటిల్ పెట్టారు. ఇది ఐకానిక్ బ్లాక్‌బస్టర్ మల్లీశ్వరిలో విక్టరీ వెంకటేష్ క్యారెక్టర్ ని గుర్తు చేస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ సప్తగిరి పాత్ర హ్యుమర్ నేచర్ ని హైలైట్ చేస్తూ డిఫరెంట్ ఎక్స్ ప్రెస్షన్స్ ని ప్రెజెంట్ చేస్తోంది. ఈ పోస్టర్ హిలేరియస్ డిజైన్ ఈ చిత్రం హై ఎంటర్మైన్మెంట్ తో ఉంటుందని సూచిస్తుంది. 
 
ఈ చిత్రానికి సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. మధు ఎడిటర్‌. ప్రియాంక శర్మ కథానాయికగా నటించారు, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ , అన్నపూర్ణమ్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
మార్చి 21న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
 
తారాగణం: సప్తగిరి, ప్రియాంక శర్మ, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్, అన్నపూర్ణమ్మ, ప్రమోదిని, బాషా, శ్రీనివాస్, ప్రభావతి, రోహిణి, రాంప్రసాద్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments