Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయయాత్రలో "సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌"‌కు ప్రజా నీరాజనం

టాలీవుడ్ స్టార్ కమెడియన్ సప్తగిరి హీరో లాంఛింగ్ సినిమా సప్తగిరి ఎక్స్‌ప్రెస్ బాక్సాఫీస్‌పై కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన ప్రతి చోటా హౌస్‌ఫుల్ వసూళ్ల రాబడుతోందని ఈ చిత్ర బృందం తెలిపింది. మాస

Webdunia
సోమవారం, 2 జనవరి 2017 (14:51 IST)
టాలీవుడ్ స్టార్ కమెడియన్ సప్తగిరి హీరో లాంఛింగ్ సినిమా సప్తగిరి ఎక్స్‌ప్రెస్ బాక్సాఫీస్‌పై కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన ప్రతి చోటా హౌస్‌ఫుల్ వసూళ్ల రాబడుతోందని ఈ చిత్ర బృందం తెలిపింది. మాస్టర్స్ హోమియోపతి అధినేత డాక్టర్ రవికిరణ్ శ్రీ సాయి సెల్యులాయిడ్ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి వస్తున్న ఆదరణ నేపథ్యంలో ఇటీవలే సప్తగిరి ఎక్స్‌ప్రెస్ టీమ్ సక్సెస్ టూర్ ప్లాన్ చేశారు.
అందులో భాగంగా మొదట శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఈ చిత్ర బృందం పర్యటించింది. వెళ్లిన ప్రతిచోటా సప్తగిరి ఎక్స్ ప్రెస్ బృందాన్ని అభిమానులు విశేషంగా ఆదరించారని నిర్మాత రవికిరణ్ తెలిపారు. 
 
త్వరలోనే నైజాం, సీడెడ్ ఏరియాల్లో కూడా పర్యటిస్తామని ఆయన చెప్పారు. ఇంతటి ఊహించని విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. సినిమాటోగ్రాఫ్ రామ్ ప్రసాద్, ఎడిటర్ గౌతంరాజు ఈ సినిమాను తమ నైపుణ్యంతో ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరించే విధంగా తీర్చిదిద్దారని, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తమ చిత్ర బృందానికి ఎంతో సహాయపడ్డారని డైరెక్టర్ అరుణ్ చెప్పారు. ఇక ఈ సినిమాకు కో-ప్రొడ్యూసర్ : డాక్టర్ వాణి రవికరిణ్, సినిమాటోగ్రాఫర్ : సి.రామ్ ప్రసాద్, ఎడిటిర్ : గౌతంరాజు, క్రియేటివ్ హెడ్ : గోపాల్ అమిరశెట్టి, మాటలు : రాజశేఖర్ రెడ్డి పులిచర్ల.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జడ్జి జ్యోతిర్మయి

జ్యోతి మల్హోత్రా లగ్జరీ జీవితం వెనుక చీకటి కోణం : వామ్మో... విస్తుపోయే నిజాలు!

ఆగివున్న లారీని ఢీకొట్టిన బస్సు - నలుగురి దుర్మరణం!!

TDP: ఐదు నెలల జీతాన్ని భారత సైన్యానికి విరాళంగా ఇచ్చిన టీడీపీ మహిళా ఎమ్మెల్యే

సూది గుచ్చకుండానే రక్త పరీక్ష ఎలా? నిలోఫర్ ఆస్పత్రి ఘనత!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments