VD13: విజయ్ దేవరకొండ సంక్రాంతికి వచ్చేస్తున్నాడు...

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2023 (13:17 IST)
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వీడీ 13గా పిలుస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలో వీడీ 13 మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది. 
 
ఎస్వీసీ సంస్థలో వస్తున్న 54వ చిత్రమిది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథతో దర్శకుడు పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు శిరీష్‌లు నిర్మిస్తున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు.
 
వీడీ 13 నుంచి షూటింగ్ ప్రోగ్రెస్‌ను మేకర్స్ ఇవాళ వెల్లడించారు. ఈ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని వారు తెలిపారు. వీడీ 13 సినిమా వచ్చే సంక్రాంతి పండుగకు గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. 
 
గీత గోవిందం వంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ పెట్ల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కు ఉన్న బ్లాక్ బస్టర్ ఇమేజ్ కూడా ఈ ప్రాజెక్ట్ మీద క్రేజ్ పెంచుతోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు.
 
నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్
టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ : కేయూ మోహనన్
సంగీతం : గోపీసుందర్
ఆర్ట్ డైరెక్టర్ : ఏ ఎస్ ప్రకాష్
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
పీ ఆర్ ఓ : జి.యస్.కే మీడియా, వంశీ కాక 
క్రియేటివ్ 
 
ప్రొడ్యూసర్ : వాసు వర్మ
నిర్మాతలు : రాజు - శిరీష్
రచన, దర్శకత్వం - పరశురామ్ పెట్ల

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. రాజకీయ అరంగేట్రం చేస్తారా?

ఢిల్లీలో పోలీసులపై పెప్పర్ స్ప్రే దాడి.. ఎందుకో తెలుసా? (Video)

ఖలీదా జియాకు గుండె - ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ - తీవ్ర అస్వస్థత

జె-1 వీసా నిరాకరించిన అమెరికా.. మనస్తాపంతో మహిళా వైద్యురాలు ఆత్మహత్య

Kerala: భార్య తలపై సిలిండర్‌తో దాడి చేసిన భర్త.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments