Webdunia - Bharat's app for daily news and videos

Install App

308 మంది అమ్మాయిలతో సంజయ్ దత్ "ఆ" రొమాన్స్ (Video)

బాలీవుడ్ హీరో సంజయ్ దత్. ముంబై పేలుళ్ళ కేసులో ముద్దాయిగా తేలి జైలుశిక్షను అనుభవిస్తున్నారు. ఈయన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'సంజు'. ఈనెల 29వ తేదీన విడుదల కానుంది. ఇందులో రణ్‌బీర్ కపూర్ లీడ్

Webdunia
సోమవారం, 25 జూన్ 2018 (17:09 IST)
బాలీవుడ్ హీరో సంజయ్ దత్. ముంబై పేలుళ్ళ కేసులో ముద్దాయిగా తేలి జైలుశిక్షను అనుభవిస్తున్నారు. ఈయన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'సంజు'. ఈనెల 29వ తేదీన విడుదల కానుంది. ఇందులో రణ్‌బీర్ కపూర్ లీడ్ రోల్‌ను పోషించాడు.
 
అయితే, ఈ కండల వీరుడుకి అనేక మంది అమ్మాయిలతో పరిచయం ఉంది. 'తన జీవితంలో సుమారు 308 మంది మహిళలతో సెక్స్' (వ్యభిచారిణులుకాకుండా) చేసినట్టు సంజయ్‌ దత్తే స్వయంగా చెబుతుంటాడు. ఇదేవిషయంపై ఈ చిత్ర దర్శకుడు హిరానీ కూడా పెదవి విప్పారు. 
 
అమ్మాయిలను ముగ్గులోకి దించేందుకు సంజయ్ దత్ తన తెలివితేటలను బాగా ఉపయోగించేవాడు. ముఖ్యంగా అమ్మాయిలను ఎమోషనల్‌కు గురిచేసేవాడు. ఆ తర్వాత మెల్లగా తన దారికి తెచ్చుకునేవాడు. 
 
ఇందుకోసం ఓ ట్రిక్‌ను అనుసరించేవాడు. తన తల్లి నర్గిస్‌దని చెబుతూ ఎవరిదో సమాధిని చూపించేవాడట. మా అమ్మతో పరిచయం చేయడానికి ఇక్కడికి నిన్ను తీసుకొచ్చాను అని అమ్మాయిలతో చెప్పేవాడు. 
 
దాంతో వాళ్లంతా కాస్త భావోద్వేగానికి లోనై.. సంజూ ట్రాప్‌లో పడిపోయేవాళ్లు. నిజానికి అతను చూపించిన సమాధి అతని తల్లి నర్గిస్‌ది కాదు అని హిరానీ చెప్పాడు.
 
అలాగే, అతని జీవితంలో జరిగిన మరో ఘటనపై మాట్లాడుతూ, ఓసారి ఓ అమ్మాయి సంజూకి బ్రేకప్ చెప్పేసింది. దీంతో ఆమెపై పగ తీర్చుకోవడానికి తన ఫ్రెండ్ కారు తీసుకొని వెళ్లి.. ఆమె ఇంటి ముందు పార్క్ చేసిన మరో కారును ఢీకొట్టాడు. 
 
అయితే అతను ఢీకొట్టిన కారు ఆమె కొత్త బాయ్‌ఫ్రెండ్‌దని సంజూకి తర్వాత తెలిసింది. రెండు కార్లు దారుణంగా దెబ్బతిన్నాయి అని హిరానీ చెప్పాడు. మాధురి దీక్షిత్, టీనా మునిమ్, రిచా శర్మలాంటి నటీమణులతోనూ సంజయ్ దత్ ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 

 

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం