Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్-2లో ఎలిమినేషన్ పర్వం.. సంజన అవుట్.. నందిని ఎంట్రీ

నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా బిగ్‌బాస్ సీజన్-2 ప్రారంభమైంది. పనిలో పనిగా ఎలిమినేషన్‌ల పర్వం కూడా మొదలైంది. ఆదివారం (జూన్-17)న జరిగిన ఎపిసోడ్‌లో సంజన ఎలిమినేట్ అయ్యారు. ఇతర కంటెస్టెంట్లతో దూకుడుగా వ

Webdunia
సోమవారం, 18 జూన్ 2018 (11:42 IST)
నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా బిగ్‌బాస్ సీజన్-2 ప్రారంభమైంది. పనిలో పనిగా ఎలిమినేషన్‌ల పర్వం కూడా మొదలైంది. ఆదివారం (జూన్-17)న జరిగిన ఎపిసోడ్‌లో సంజన ఎలిమినేట్ అయ్యారు. ఇతర కంటెస్టెంట్లతో దూకుడుగా వ్యహరిస్తూ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన రోజు నుంచి కాంట్రవర్శీలకు సంజనా కేరాఫ్ అడ్రస్‌గా మారారు. దీంతో బిగ్ బాస్ కుటుంబ సభ్యులు తొలి వారం ఎలిమినేషన్‌‌కు సంజనాను నామినేట్ చేశారు. 
 
ఓటింగ్‌‌లో ఆడియన్స్ నుంచి కూడా ఓట్లు తక్కువగా రావడంతో సంజనా హౌస్ నుండి బయటకు వచ్చేశారు. హౌస్ నుంచి బయటకు వచ్చే సమయంలో తేజస్వి, బాబు గోగినేనిలపై విమర్శలు చేశారు సంజనా. బాబుగోగినేని బయటకి కనిపించేంత మంచి వ్యక్తి బాబుగోగినేని కాదని తెలిపారు. తేజస్వి పక్క వారితో ఎలా ఉండాలో నేర్చుకోవాలన్నారు. ఇక సంజన బిగ్ బాంబ్‌ను కూడా బాబు గోగినేనిపై ప్రయోగించారు. 
 
దీని ప్రకారం ఈ వారం మొత్తం ఎవరికి మంచి నీళ్లు కావల్సివచ్చినా వారికి బాబు గోగినేనే నీళ్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఎలిమినేట్‌ అయిన సంజన స్థానంలో హీరోయిన్‌ నందినీ ఎంట్రీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad Rains: ఇది ఫ్లైఓవరా పిల్లకాలువా? (video)

గంగానదిలో తేలియాడుతున్న రాయి, పూజలు చేస్తున్న మహిళలు (video)

రాజస్థాన్‌లో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన వ్యక్తి.. చేయిచ్చి కాపాడిన హోటల్ యజమాని (video)

RK Roja: రోజా కంటతడి.. పిల్లల్ని కూడా వదలరా.. (video)

ఫేస్‌బుక్‌లో టిటిడి ఈఓ పేరిట మోసం.. అప్రమత్తంగా వుండాలంటున్న విజిలెన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments