Webdunia - Bharat's app for daily news and videos

Install App

సందీప్ కిష‌న్, విజ‌య్ సేతుప‌తి సినిమా ‘మైఖేల్’

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (17:35 IST)
Michael
సందీప్ కిష‌న్ హీరోగా విజ‌య్ సేతుప‌తి స్పెష‌ల్ యాక్ష‌న్ రోల్‌ను చేస్తున్న సినిమా ‘మైఖేల్’. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పి భారీ చిత్రాల‌కు సంబంధించి ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం అనే భారీ సినిమా అనౌన్స్‌మెంట్ చేశారు. మ‌రో నిర్మాణ క‌ర‌ణ్ సి ప్రొడ‌క్ష‌న్స్ ఎల్ఎల్‌పితో క‌లిసి ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను రూపొందించ‌నున్నారు.
 
నిర్మాత సునీల్ నారంగ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘మైఖేల్’ చిత్రాన్ని అధికారికంగా ప్ర‌క‌టిస్తూ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్ట‌ర్‌ను చూస్తుంటే సినిమాలో మైఖేల్ అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో సందీప్ కిష‌న్ న‌టించ‌బోతున్నార‌ని అర్థ‌మ‌వుతుంది.
 
పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. సందీప్ కిష‌న్ ఓ చేతికి బేడీలు త‌గిలించి ఉన్నారు. అలాగే సందీప్ మ‌రో చేతిలో న‌క‌ల్స్ (ఇనుముతో చేసిన ఆయుధం)ను ప‌ట్టుకుని ఉన్నాడు. అత‌ని చేతుల‌కు, ష‌ర్టుకు ర‌క్తం అంటుకుని ఉంది. పోస్ట‌ర్‌ను చూస్తుంటే మైఖేల్ సినిమా ఔట్ అండ్ ఔట్‌యాక్ష‌న్ మూవీగా అనిపిస్తుంది. సందీప్ కిష‌న్ ఇలాంటి పాత్ర‌లో న‌టించ‌డం ఇదే తొలిసారి.
 
పాన్ ఇండియా రేంజ్‌లో రూపొంద‌నున్న ఈ చిత్రాన్ని రంజిత్ జెయ‌కోడి తెర‌కెక్కిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో సినిమా సిద్ధ‌మ‌వుతుంది. ద‌ర్శ‌కుడు రంజిత్ ఓ డిఫ‌రెంట్ స్క్రిప్ట్‌ను ప్రిపేర్ చేశారు. ఈ సినిమాలో న‌టించ‌బోయే న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు ఇదొక స్పెష‌ల్ మూవీగా నిలుస్తుంద‌నిపిస్తుంది.
 
భారీ స్కేల్‌లో రూపొంద‌బోయే మైఖేల్ చిత్రాన్ని నారాయ‌ణ్ దాస్ కె.నారంగ్ స‌మ‌ర్ప‌ణ‌లో భ‌ర‌త్ చౌద‌రి, పుస్కూరు రామ్మోహ‌న్ రావు నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రంలో న‌టించ‌బోయే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు.
 
ద‌ర్శ‌క‌త్వం:  రంజిత్ జెయ‌కోడి
నిర్మాత‌లు:  భ‌ర‌త్ చౌద‌రి, పుస్కూరు రామ్మోహ‌న్‌రావు
స‌మర్ప‌ణ‌:  నారాయ‌ణ దాస్ కె.నారంగ్‌
బ్యాన‌ర్స్‌:  శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పి, క‌ర‌ణ్ సి ప్రొడ‌క్ష‌న్స్ ఎల్ఎల్‌పి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments