Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశం కోసం ఆడిన వారి ప‌రిస్థితి చూసి షాక్ అయ్యాః సందీప్ కిషన్

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (19:45 IST)
Sundeep kishan
`క్రికెట్ మీద చాలా సినిమాలు వ‌చ్చాయి. క‌బ‌డ్డీ మీద వ‌చ్చాయి.పెద్ద‌గా తెలియ‌ని ర‌బ్బీ గేమ్‌పై సినిమాలూ వ‌చ్చాయి. కానీ ఆ త‌ర్వాత అవి ఎవ్వ‌రూ పెద్ద‌గా ఆడ‌లేదు. క్రికెట్ వ్యాపారంగా మారిపోయింది. కానీ మొద‌టిసారి జాతీయ‌స్థాయిలో హాకీ ఆట‌లో గోల్డ్‌క‌ప్ సాధించిన గేమ్‌ను అంద‌రూ మ‌ర్చిపోయారు. అలాంటి గేమ్‌ను క‌థ‌గా ఎంచుకుని సినిమా తీయాల‌నే క‌సితోనే ఏ1 ఎక్స్ ప్రెస్` సినిమా చేశాన‌ని క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్ తెలియ‌జేస్తున్నాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా డెనీస్ దర్శకత్వంలో తెరకెక్కించిన స్పోర్ట్స్ డ్రామా ఇది. టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, సందీప్ నిర్మాత‌లు. శుక్ర‌వారం విడుద‌ల‌కానున్న ఈ సినిమా గురించి సందీప్‌తో ఇంట‌ర్వ్యూ.
 
రీమేక్ నే ఎందుకు ఎంచుకున్నారు?
నా 25వ సినిమాగా ఒక రీమేక్ అనే కన్నా మంచి కంటెంట్ సినిమా చేయాల‌ని చేసిందే ఈ సినిమా. ఇందులోని కీ పాయింట్ ను తెలుసుకోవాలని ప్లాన్ చేసాం. ఇంకా చెప్పాలి అంటే ఒరిజినల్ వెర్షన్ కు అప్పట్లో తమ లిమిటెడ్ బడ్జెట్ కు ఇంతే చెయ్యగలం అని చెప్తే అంతలోనే చేశామని మ్యూజిక్ డైరెక్షర్ హిప్ హాప్ తమీజా చెప్పాడు. ఒకవేళ మేము ఎక్కువ పెడితే దాని కన్నా బెటర్ చేంజెస్ చెయ్యొచ్చని చెప్పారు. సో మేము జస్ట్ ఒక ఐడియాకు మాత్రమే రేట్ ఇచ్చాం తప్పితే మిగతా అంతా కొత్తగా ఉంటుంది.
 
ఈ సినిమా చేసేట‌ప్పుడు మీకు గుర్తిండిపోయే విష‌యం ఏమైనా వుందా?
చాలా విష‌యాలు వున్నాయి. గేమ్ కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాను. 6 నెల‌లు ఆట నేర్చుకున్నాను. గేమ్‌లో చాలా దెబ్బ‌లు త‌గిలాయి. అన్నింటికంటే నేను ఆశ్చ‌ర్య‌పోయింది ఏమంటే, మా టీమ్‌తోపాటు అండ‌ర్ 19 హాకీ ప్లేయ‌ర్స్‌ను 8 మందిని తీసుకున్నాం. వాళ్ళు ఒక్క రోజుకు 5వేలు అడిగారు. ఇండియా కోసం ఆడిన ఆ ఆట‌గాళ్ళు రోజంతా సాయంత్రంవ‌ర‌కు మాతో వుంటూ క‌ష్ట‌ప‌డితే వారు అడిగింది చాలా త‌క్కువ అనిపించింది. వారి ప‌రిస్థితి చూసి చాలా ఆశ్చ‌ర్యమేసింది. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందా అన్నది అందుకే ఇలాంటి పాయింట్ నే ఈ సినిమాలో చూపించి మా వంతు ప్రయత్నం చేసాం. ఇక నిన్న‌నే ఓ మొమ‌ర‌బుల్ ఒక‌టి జ‌రిగింది. మా టీమ్ సెకండాఫ్ చూసింది. అంతా అయ్యాక వారు ఫోన్‌లో ఏడ్చేశారు. అంత‌లా క‌నెక్ట్ అయ్యారు. అదే రేపు ప్రేక్ష‌కులు ఫీల్ అవ్వాలి. ఆ ఎన‌ర్జీ నాకు కావాలి.
 
మీరు రామ్ కామ్ చేసారు ఎమోషనల్ కూడా చేశారు రెండిట్లో తేడా ఏం చూసారు?
రామ్ కామ్ లో ఏముండవండి ఏదో సింపుల్ గా ఇచ్చినవి చేసేస్తే చాలు. కానీ ఇలాంటి వాటిలో మాత్రం ఒక గ్రాఫ్, జర్నీ, అప్ అండ్ డౌన్స్ లాంటి చాలా ఉంటాయి నటుడిగా ఏం ప్రూవ్ చేసుకోవాలి అన్నది ఉంటాయి. అలాగే నాకు రోమ్ కామ్ గా ఏముండవా అంటే ఉన్నాయి నాకు లావణ్యకి కెమిస్ట్రీ సూపర్బ్ గా వర్క్ అయ్యింది కానీ కోర్ స్టోరీ అది కాదు కదా అందుకే దీన్ని ఒక కొత్త కమెర్షియల్ ఫిలిం అని చెప్తా నేను. న‌న్ను నేను నిరూఇపంచుక‌నేందుకు చేశా.
 
ఒక స్పోర్ట్స్ మెన్ పొలిటికల్ కష్టాలను చూపించే ప్రయత్నం చేసినట్టున్నారు?
ఇక్కడ పొలిటికల్ కష్టాలు అని కాదు దానికి దీనికి సంబంధం లేదు ఇక్కడ ఏమవుతుంది అంటే ఎంతో కష్టపడుతున్న ఒక స్పోర్ట్స్ మెన్ కు రావాల్సిన గుర్తింపు ఆదరణ రావట్లేదు ఇది ఎందులో తీసుకున్నా సరే. అందుకు సింపుల్ గా ఆ పదాన్ని అన్నాం తప్పితే దానికి దీనికి సంబంధం లేదు.
 
హాకీని ఏ స్టేడియంలో ఆడారు? ఎలా అనిపించింది?
ఇందులో అంతా కొత్తగా ఉంటుంది. పంజాబ్ ఛండీఘ‌ర్‌లోని మొహాలీ స్టేడియమ్ లో ఆడాం. అక్క‌డి గ్రౌండ్ చాలా పెద్ద‌ది. చూస్తే అదే ఫిల్మ్ నగర్ అంత ఉంది. అందులో కెమెరా పట్టుకొని అంద‌రినీ తీయాలి. కెమెరామెన్ కు చాలా ప‌ని. దాదాపు 400 మంది టీమ్ వెళ్ళాం. అస‌లు క‌థంతా గ్రౌండ్‌ కోస‌మే. అది సినిమాలో చూడాల్సిందే.
 
Sundeep kishan
క్రికెట్ తో పోలిస్తే హాకీకి ఆదరణ తక్కువ సో రిస్క్ ఏమన్నా అనిపించిందా?
నా చిన్న‌ప్పుడు టెన్నిస్‌కు క్రేజ్ వుంది. ఆ త‌ర్వాత త‌గ్గింది. అలాగే `ఒక్క‌డు` త‌ర్వాత క‌బ‌డ్డీ చూశారు. ఆ త‌ర్వాత అంద‌రూ క‌బ‌డ్డీ ఆడ‌లేదుగా. అందుకే ఏ గేమ్‌ను చూడాల‌న్నా బిజినెస్ మేన్ నిర్ణ‌యిస్తాడు అనే డైలాగ్ పెట్టాం. క‌థ‌ప‌రంగా వుంటుంది. ఆల్రెడీ క్రికెట్ చాలా పాపులర్ కాబట్టి కొత్తగా ట్రై చెయ్యాలని హాకీ తీసుకున్నాం. ఇప్పుడు హాకీ ఇండియ‌న్ నేష‌న‌ల్ గేమ్ అనేది గుర్తులేకుండా పోయింది. దాన్ని మ‌ర‌లా చెప్పే ప్ర‌య‌త్నం చేశాం. 
 
ఈ సినిమాకి హీరోగానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా చేశారు..
ప్రొడక్షన్ అనేది ఎందుకు అంటే చాలా ఎగ్జైటింగ్ గా క్రియేటివ్ జాబ్ లా అనిపిస్తుంది ఇంకా అంతా ప్రొడక్షన్ అంటే ఫైనాన్సియల్ గానే అనుకుంటారు కానీ అలా కాదు అది క్రియేటివ్ జాబ్ మాత్రమే. ఇంకోటి కొన్నిసార్లు మనకి ఏదన్నా బాగా నమ్మితే అందులో మనం కూడా భాగస్వామి కావాలి అందుకే నేను ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా కూడా చేశాను.
 
త‌దుప‌రి సినిమాలు?
“రౌడీ బేబీ” ఆల్ మోస్ట్ అయ్యిపోయింది. ఇంకా “వివాహ భోజనంబు” లో చిన్న క్యామియో ఉంది చాలా క్యూట్ ఫిల్మ్ అది. అదవ్వగానే మహేష్ కోనేరు ప్రొడక్షన్ లో ఒకటి ఏకే ఎంటెర్టైన్మెంట్స్ లో ఒకటి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments