Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీక్రెట్ కెమేరాల నుంచి అందమైన అమ్మాయిలను చూస్తున్న హీరోయిన్ బోయ్‌ఫ్రెండ్... కస్సుమన్న కాలనీవాసులు

కొందరి ముఖం చూస్తే పెట్టబుద్ధి అవుతుంది... మరికొందరు ముఖం చూస్తే మొట్టబుద్ధి అవుతుందనే మాట మన పెద్దలు చెప్తుంటారు. అలాంటిదే తన విషయంలోనూ జరుగుతోందని బాలీవుడ్ హీరోయిన్ ప్రియుడు వాపోతున్నాడు. ఇంతకీ అసలేం జరిగిందయా అంటే... బాలీవుడ్ హీరోయిన్ సనాఖాన్ తెలు

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2016 (17:13 IST)
కొందరి ముఖం చూస్తే పెట్టబుద్ధి అవుతుంది... మరికొందరు ముఖం చూస్తే మొట్టబుద్ధి అవుతుందనే మాట మన పెద్దలు చెప్తుంటారు. అలాంటిదే తన విషయంలోనూ జరుగుతోందని బాలీవుడ్ హీరోయిన్ ప్రియుడు వాపోతున్నాడు. ఇంతకీ అసలేం జరిగిందయా అంటే... బాలీవుడ్ హీరోయిన్ సనాఖాన్ తెలుసు కదా. వివాదాలకు ఆమె కేరాఫ్ అడ్రెస్. ఇప్పుడు ఆమె బోయ్ ఫ్రెండ్ కూడా అదే దారిలో నడుస్తున్నాడు. 
 
ముంబయిలో తను నివాసముంటున్న ఇంట్లో ఎక్కడబడితే అక్కడ సీక్రెట్ కెమేరాలు ఏర్పాటు చేశాడట. ఈ కెమేరాలతో అతడు ఏదో చేయరాని కార్యకలాపాలు చేస్తున్నాడంటూ అదే అపార్టుమెంట్లో నివాసముంటున్నవారు ఆరోపిస్తున్నారు. ఆ కెమేరాల ద్వారా మహిళను చూస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఆరోపిస్తున్నారు. సనాఖాన్ బోయ్ ఫ్రెండ్ మాత్రం అలాంటిదేమీ లేదనీ, తను కేవలం సెక్యూరిటీ కోసమే ఈ కెమేరాలను ఏర్పాటు చేసినట్లు చెపుతున్నాడు. 
 
ఐతే సీక్రెట్ కెమేరాలను ఏర్పాటు చేయాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరి. ఐతే సనాఖాన్ ప్రియుడు అలాంటివేమీ తీసుకోలేదని సమాచారం. తన ఇంటికి ఎవరైనా అమ్మాయిలు వచ్చినప్పుడు వారిని ఆ సీక్రెట్ కెమేరాల్లో చిత్రీకరించి ఆ తర్వాత వారిని బ్లాక్ మెయిలింగ్ చేసే అవకాశం ఉందని అపార్టుమెంట్లో ఉంటున్నవారు చెపుతున్నారు. ఐతే సనాఖాన్ ప్రియుడు మాత్రం వారి మాటలను కొట్టిపారేస్తున్నాడు. మొదట్నుంచి తన పట్ల అపార్టుమెంట్ వాసులకు కిట్టదని చెప్పుకొచ్చాడు. కానీ ఆ సీక్రెట్ కెమేరాలు ఎందుకన్నది తెలియాల్సి ఉంది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments