Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా సోదరుడి లాగే సంపూర్ణేష్ బాబు నవ్వు కూడా స్వచ్ఛంగా ఉంటుంది : మంచు మనోజ్

Webdunia
శనివారం, 25 నవంబరు 2023 (14:56 IST)
Sampuranesh Babu, Manchu Manoj, Sanjosh
సంపూర్ణేష్ బాబు, సంజోష్ అన్న దమ్ములుగా నటిస్తున్న సినిమా సోదరా. సోదరా సాంగ్ లాంచ్  మంచు మనోజ్ చేశారు. నిన్న రాత్రి జరిగిన వేడుకలో చిత్ర దర్శకుడు మన్ మోహన్ మేనంపల్లి, ప్రొడ్యూసర్ చంద్ర చగంలా, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్, మాధవ్, ప్రొడ్యూసర్ శివన్ కుమార్ పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ : ఈ సోదరా సాంగ్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. డార్లింగ్ సంపు అండ్ స్మైల్ ఎప్పుడు కూడా స్వచ్ఛంగా హార్ట్ ఫుల్ గా ఉంటుంది. సంపూర్ణేష్ ని చూస్తే 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నా సోదరుడు ప్రసాద్ గుర్తుకు వచ్చాడు. ఆయన్ను  కోల్పోయాను. ఆయన నవ్వు స్వచ్ఛంగా ఉంటుంది అలాగే సంపూర్ణేష్ బాబు నవ్వు కూడా స్వచ్చంగా అనిపిస్తుంది. సంజోష్ ఈ సినిమాతో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే దర్శకుడు ప్రొడ్యూసర్లు పడిన కష్టం ఈ సినిమాలో తెలుస్తుంది ఈ సినిమా అందరికీ మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
 
సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ : నా సొంత సోదరుడిలా భావించే మంచు మనోజ్ఈ కార్యక్రమానికి విచ్చేసి సాంగ్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. కరెంటు తీగ సినిమా చేసినప్పటి నుంచి ఆయనతో అనుబంధం కొనసాగుతుంది అప్పటినుంచి నన్ను ఒక సొంత సోదరుడిలా భావించారు. అలాగే ఈ పాట ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలవుతోంది. ఈవెంట్ కొచ్చి మమ్మల్ని బ్లెస్స్ చేసిన మంచి మనోజ్ గారు కృతజ్ఞతలు అన్నారు.
 
సంజోష్ మాట్లాడుతూ : అన్నంటే దోస్తే సోదరా సాంగ్ లాంచ్ ఈవెంట్ కి వచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మంచి మనోజ్ గారి కృతజ్ఞతలు. షూటింగ్ బిజీలో ఉండి కూడా మా కోసం ఒక రోజుని ఇచ్చి ఈవెంట్ కి వచ్చారు. అలాగే ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
 
నిర్మాత చంద్ర చాగంల మాట్లాడుతూ : ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ కి వచ్చిన మంచు మనోజ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ సాంగ్ పెద్ద సక్సెస్ అవుతుందని అలాగే సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు.
 
దర్శకుడు మన్ మోహన్ మేనంపల్లి : అన్నంటే దోస్తే సోదరా సాంగ్ రాసింది సుద్దాల అశోక్ తేజ గారు ఆయన పాట రాసేటప్పుడు ఎంతో కనెక్ట్ అయ్యారు అలాగే అప్పుడే చెప్పారు ఈ పాట మంచి సక్సెస్ అవుతుందని అండ్ ఈ సినిమాకి సంగీతం సునీల్ కశ్యప్ అందించారు. ఈ సినిమా అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని అద్దం పట్టేలా ఉంటుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంచు మనోజ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

తోడుకోసం ఆశపడి రూ.6.5 కోట్లు పోగొట్టుకున్న యూపీవాసి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments