Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంపూ వర్సెస్ ట్రంప్... ఒక్కరు కాదు ముగ్గురు

'హృదయ కాలేయం' చిత్రంలో టాలీవుడ్‌లో సంచలనంగా మారిన హీరో సంపూర్ణష్ బాబు. ఈయన నటించిన రెండో చిత్రం 'కొబ్బరిమట్ట'. నవంబరు 14వ తేదీన ప్రేక్షకుల మందుకురానుంది. ఈ చిత్రానికి రూపక్ రోనాల్డ్ సన్ దర్శకత్వం వహిం

Webdunia
ఆదివారం, 23 సెప్టెంబరు 2018 (10:31 IST)
'హృదయ కాలేయం' చిత్రంలో టాలీవుడ్‌లో సంచలనంగా మారిన హీరో సంపూర్ణష్ బాబు. ఈయన నటించిన రెండో చిత్రం 'కొబ్బరిమట్ట'. నవంబరు 14వ తేదీన ప్రేక్షకుల మందుకురానుంది. ఈ చిత్రానికి రూపక్ రోనాల్డ్ సన్ దర్శకత్వం వహించగా, ఆది కుంభగిరి, సాయిరాజేష్ నీలం నిర్మాతలు. 
 
సినిమా సాంగ్ టీజర్‌ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు కృష్ణారావు మాట్లాడుతూ "చాలా సంతృప్తిగా ఈ చిత్రాన్ని నిర్మించినట్టు తెలిపారు. ఈ సినిమా రిలీజ్ రోజున సంపూర్ణేష్, సాయిరాజేశ్‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాం. షూటింగ్ మొత్తం అమెరికాలో ఉంటుంది. సంపూ ఇన్ అమెరికా. సంపూ వర్సెస్ ట్రంప్ అని ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. 
 
ఆ తర్వాత హీరో సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ "హృదయ కాలేయం" కంటే కొబ్బరిమట్ట చిత్రంతో వంద రెట్లు ఎంజాయ్ చేస్తారు. మిట్టపల్లె అనే చిన్న ఊరు నుండి నన్ను తీసుకొచ్చి రాజేష్ అన్న  హృదయ కాలేయం సినిమా చేశాడు. అలాగే కొబ్బరి మట్ట సినిమాకు తనే ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఆయన వెనుక నిలబడి ఎన్నిరోజులైనా సపోర్ట్ అందిస్తాను. సినిమాలో నటించిన ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు అని చెప్పారు. 
 
దర్శకుడు రూపక్ రొనాల్డ్‌సన్ మాట్లాడుతూ 'ఒక సంపూని చూస్తేనే కామెడీ ఎంత ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఇందులో ముగ్గురు సంపూర్ణేష్‌లు ఉంటారు. నవంబర్ 14న సినిమా విడుదలవుతుంది' అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments