Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫస్ట్ గ్లింప్స్ తోనే అంచనాలు భారీగా పెంచేసిన సమంత యశోద

Webdunia
సోమవారం, 11 జులై 2022 (14:55 IST)
Samantha- Yashoda
సమంత న‌టిస్తున్న చిత్రం యశోద. శ్రీదేవి మూవీస్ పతాకం పై  రూపొందుతున్న ఈ చిత్రానికి హరి-హరీష్ దర్శకత్వం  వహిస్తున్నారు. చిత్ర నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ చిత్రం గురించి మాట్లాడుతూ, సాంకేతికంగా ఎక్కడా తగ్గకుండా భారీ బడ్జెట్ తో మా యశోద చిత్రాన్ని 100 రోజుల్లో పూర్తి చేశాం. సాంగ్ మినహా టాకీ షూట్ మొత్తం పూర్తయింది. ఒకవైపు గ్రాఫిక్స్ పని జరుగుతుండగా  ఈ నెల 15 నుండి డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెడుతున్నాం ఆ వెంటనే ఇతర భాషల డబ్బింగ్ కూడా జరుగుతుంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ లో కుడా అదే స్థాయిలో చేయబోతున్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పాన్ ఇండియన్ చిత్రంగా విడుదల చేయడానికి 'యశోద' పూర్తిగా సిద్ధమాయ్యాకే మంచి తేదీ చూసుకుని కొత్త విడుదల తేదీ ప్రకటిస్తాము. 
 
అలాగే రానున్న రోజుల్లో చిత్రానికి సంబంధించిన పాటలు, టీజర్ విడుదల మరియు ఇతర వివరాలు తెలియజేస్తాము. సమంత ‘యశోద’ పాత్రని సొంతం చేసుకున్న తీరు చూస్తే చాలా గర్వంగా ఉంది. చాలా ఏకాగ్రతతో, పూర్తి డెడికేషన్ తో యాక్షన్ మరియు ఇతర సన్నివేశాలు అద్భుతంగా చేసింది. సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉండబోతుంది. నటీ నటులు, సాంకేతిక నిపుణులు అందరూ చిత్రం అద్భుతంగా వచ్చేలా సహకరించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి చిత్రాన్ని పూర్తిగా సిద్ధం చేస్తున్నాం’’ అని చెప్పారు.
 
సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
 
సంగీతం: మణిశర్మ
మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి,
పాటలు: చంద్రబోస్,రామజోగయ్య శాస్త్రి
క్రియేటివ్ డైరెక్టర్: హేమంబ‌ర్ జాస్తి
కెమెరా: ఎం. సుకుమార్
ఆర్ట్: అశోక్
ఫైట్స్: వెంకట్, యానిక్ బెన్
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక
సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి
దర్శకత్వం: హరి - హరీష్
నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ టాప్ మెహెందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య, కారణం ఏంటి?

HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి బొమ్మ దగ్ధం (Video)

Kethireddy: పవన్ ఎక్కడ పుట్టారో ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు.. తింగరి: కేతిరెడ్డి (video)

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments