Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్టర్ రాధారవి.. పాప్‌కార్న్‌ తింటూ ఎంజాయ్ చేయండి.. సమంత(Video)

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (12:38 IST)
సహ నటి నయనతారను కించపరిచేలా వ్యాఖ్యానించి తమిళ సీనియర్ నటుడు రాధారవిపై అక్కినేని ఇంటి కోడలు, హీరోయిన్ సమంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా, ఆమె ఓ కఠిన నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇకపై రాధారవి నటించే చిత్రాల్లో నటించబోనని తెగేసి చెప్పారు. 
 
తాజాగా నయనతార నటించిన చిత్రం "కొలైయుదిర్ కాలం". ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు చెన్నైలో జరిగాయి. ఈ వేడుకలకు రాధారవి హాజరయ్యారు. అపుడు కించపరిచేలా వ్యాఖ్యానించారు. రాధారవి ఈ చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో పెను దుమారాన్ని రేపాయి. నయనతార ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌, వరలక్ష్మి, రాధిక, గాయని చిన్మయి తదితరులు బహిరంగంగానే రాధారవి తీరుని ఖండించారు. 
 
అలాగే, సోషల్‌ మీడియాలోనూ ఆయనపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రాధారవికి నడిగర్‌ సంఘం నోటీసులు పంపింది. ఇక నుంచి ఆయనను సినిమాల్లోకి తీసుకోబోమని ఓ నిర్మాణ సంస్థ ప్రకటించింది. నయన్‌ కూడా తన అభిప్రాయాన్ని వెల్లిడిస్తూ ఆయనకు గుణపాఠం చెప్పేసింది.
 
తాజాగా, టాలీవుడ్ హీరోయిన్ సమంత కూడా కఠిన నిర్ణయం తీసుకుంది. "మిస్టర్ రాధారవి.. కష్టం ఎప్పటికీ అలాగే నిలిచి ఉంటుంది. మీ బాధ చూసి మేము తట్టుకోలేకపోతున్నాం. మీకు ప్రశాంతత లభించాలని కోరుకుంటున్నాం. నయనతార తర్వాతి సూపర్‌హిట్‌ సినిమా టికెట్లు మీకు కొనిస్తాం. పాప్‌కార్న్‌ తింటూ ఎంజాయ్ చేయండి" అని పేర్కొంటూ ట్వీట్ చేసింది. వీడియో చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జైలులో ప్రాణహాని జరిగితే పాక్ సైన్యానిదే బాధ్యత : ఇమ్రాన్ ఖాన్

Nara Lokesh: మరో 2వేల కుటుంబాలకు ఆగస్టు నాటికి శాశ్వత ఇళ్ల పట్టాలు.. నారా లోకేష్

పాకిస్థాన్‌కు గూఢచర్యం - జమ్మూకాశ్మీర్‌లో సైనికుడి అరెస్టు

మద్యానికి బానిసై తల్లిదండ్రులను సుత్తితో కొట్టి చంపేసిన కిరాతకుడు

SASCI పథకం: కేంద్రం నుండి రూ.10,000 కోట్లు కోరిన సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments