Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతకు అరుదైన గౌరవం.. ఇండియన్ లేడీ సూపర్ స్టార్ అంటూ..

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2023 (19:12 IST)
Samantha Ruth Prabhu
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభుకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా సమంతకు అరుదైన ఆహ్వానం అందింది. ఇది ఇక్కడ కాదు అమెరికాలోనే కావడం విశేషం. ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ న్యూయార్క్‌లో నిర్వహించే ఇండియా పరేడ్‌లో పాల్గొనాల్సిందిగా సమంతకు ఆహ్వానం అందింది. 
 
ఈ సంఘం అమెరికా ఆధారంగా పనిచేస్తుంది. ఆగస్టు 15న మనం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటాం. అమెరికా కాలమానం ప్రకారం ఆగస్టు 20న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అక్కడ కవాతు నిర్వహిస్తున్నారు. 
 
ఈ కార్యక్రమం న్యూయార్క్ నగరంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి అతిథిగా పాల్గొనాల్సిందిగా సమంతను ఆహ్వానించడం విశేషం. ఈ సందర్భంగా సమంతను ఇండియన్ లేడీ సూపర్ స్టార్ అని సంబోధించనున్నారు. 41వ వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పరేడ్ అక్కడ జరుగుతోంది.
 
ఈ వేడుకలో సమంతతో పాటు ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ పాల్గొనబోతున్నారు. ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. భారతదేశం మిషన్ లైఫ్ ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. న్యూయార్క్‌లో జరిగే ఈ స్వతంత్ర వేడుకకు సినీ తారలను ఆహ్వానించడం అరుదైన విషయమే అని చెప్పాలి. 
 
సమంత రూత్ ప్రభుని ఆహ్వానించడం గౌరవంగా భావించవచ్చు. 
 
సమంత ఇప్పుడు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఏడాది పాటు సినిమాలకు విరామం ఇస్తున్నట్లు ఆమె ప్రకటించిన సంగతి తెలిసిందే. మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకుని సాధారణ వ్యక్తిగా మారేందుకు, మానసికంగా, శారీరకంగా దృఢంగా మారేందుకు ఈ విరామం తీసుకున్నట్లు సమంత తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోజాపువ్విచ్చి ప్రపోజ్ చేస్తే.. ఫ్యాంటు జారిపోయి పరువంతా పోయింది... (Video)

కుంభ‌మేళ‌లో పూస‌ల‌మ్మే మోనాలిసాపై దాష్టీకం (Video)

జనసేనకు శుభవార్త... గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ....

Monalisa Bhonsle కుంభమేళలో దండలమ్ముకునే యువతి మోనాలిసాకి బాలీవుడ్ బంపర్ ఆఫర్

తెలంగాణలోకి కింగ్‌ఫిషర్ బీర్.. ఇక మందుబాబులకు పండగే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments