Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత నటించిన శాకుంతలం త్రీడీలో ఫిబ్రవరి 17న రాబోతున్నది

Webdunia
సోమవారం, 2 జనవరి 2023 (12:14 IST)
Shakuntalam date poster
సమంత నటించిన శాకుంతలం ఫిబ్రవరి 17న రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందుకు సంభందించిన పోస్టర్ ను సోమవారం బయట పెట్టింది. ఈ ఏడాది భారతీయ చిత్రసీమలో భారీ అంచనాలున్న సినిమాల్లో శాకుంతలం ఒకటి. ఈ చిత్రంలో అలనాటి అందాల నటి సమంత టైటిల్ రోల్‌లో నటిస్తోంది. ఇండియన్ సినిమాలో ఎప్పటినుండో ఎపిక్ లవ్ స్టోరీల్లో ఒకటిగా దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో తెరకెక్కించారు.
 
కాళిదాసు రాసిన నాటకం ద్వారా తెలిసిన శకుంతల, ఆమె భర్త దుష్యంత ప్రేమ కథతో ఈ చిత్రం చిత్రీకరించబడింది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న శకుంతలం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో అందరి మనసులకు చేరువైంది. ఇప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో మేకర్స్ ప్రేక్షకులను ఫిదా చేశారు. భారీ స్థాయిలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 17, 2023న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
 
ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్‌రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సహకారంతో గుణ టీమ్‌వర్క్స్ బ్యానర్‌పై ఈ చిత్రం చేయబడింది, ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.
 
ఆ అద్భుతాన్ని అందరూ చవిచూసేలా త్రీడీలో ఈ సినిమా విడుదల కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఫిబ్రవరి 17, 2023న విడుదల చేయడానికి షెడ్యూల్ చేయబడింది. గుణశేఖర్ రచన, దర్శకత్వం వహించారు. సాయిమాధవ్ బుర్రా ఈ చిత్రానికి డైలాగ్స్ రాశారు. శేఖర్ వి జోసెఫ్ సినిమాటోగ్రాఫర్, ప్రవీణ్ పూడి ఎడిటర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని మోడీ భద్రతా వలయంలో లేడీ కమాండో...!!

బాలానగర్ సీతాఫలంకు భౌగోళిక గుర్తింపు!

కదులుతున్న అంబులెన్స్‌లో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

పిల్లలకు భోజనం పెట్టే ముందు రుచి చూడండి.. అంతే సంగతులు: రేవంత్ వార్నింగ్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments