Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ డైరక్టర్లకు సమంత క్లాస్.. కథలు బాగోలేకపోతే గోవిందా గోవిందా!!

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2016 (18:40 IST)
టాలీవుడ్‌లో వరుస పరాజయాలు తప్పట్లేదు. టాప్ హీరోల సినిమాలు ఫట్ అవుతున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు సైతం హిట్ టాక్‌ను సంపాదించుకోవట్లేదు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ దర్శకులకు హీరోయిన్ సమంత గట్టి క్లాస్ పీకిందని వార్తలొస్తున్నాయి. దక్షిణాదిన టాప్ హీరోయిన్‌గా రాణిస్తూ మరో రెండేళ్లకు ఢోకా లేదన్నట్టుగా ఛాన్సులు సొంతం చేసుకుంటూ.. కెరీర్ పరంగా ముందడుగు వేస్తున్న సమంత ఓ సినిమా ఫంక్షన్లో ఇండస్ట్రీ డైరక్టర్లకు హితవు పలికింది. 
 
కథలను ఎంచుకోవడంపై దర్శకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, కథలు బాగుంటేనే, కలెక్షన్లకు ఢోకా ఉండదని సమంత వెల్లడించింది. కాబట్టి కథలు బాగుండేలా దర్శకులు ప్లాన్ చేసుకోవాలని, లేదంటే తొలి రోజు, తొలి షోకే సినిమా ఫ్లాఫ్ అంటూ లక్షల్లో ప్రేక్షకులకు మెసేజ్‌లు వెళ్తాయని సమంత హెచ్చరించింది. ఈ మెసేజ్‌లే సినిమా ఫట్ కావడానికి, కలెక్షన్స్ లేకుండా చేసేందుకు కారణమవుతాయని సమంత వెల్లడించింది. 
 
అందుకే దర్శకులు మంచి కథల్ని ఎంచుకోవాలని టాప్ హీరోయిన్ అయిన సమంత మళ్లీ మళ్లీ చెప్పింది. సమంత చెప్పిన విషయం కరెక్టేనని సినీ పండితులు అంటుంటే దర్శకులు మాత్రం డైరక్టర్లకు సలహా ఇచ్చే స్థాయికి సమంత ఇంకా ఎదగలేదని కౌంటర్లిస్తున్నారట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments