Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా బరువు గురించి మీకెందుకయ్యా... నెటిజన్‌పై సమంత ఫైర్

ఠాగూర్
బుధవారం, 6 నవంబరు 2024 (10:37 IST)
తన బరువు గురించి ప్రశ్నించి ఓ నెటిజన్‌పై హీరోయిన్ సమంత మండిపడ్డారు. తన బరువు గురించి మీకెందుకయ్యా అంటూ ఆమె సూటిగా ప్రశ్నించారు. బరువు ఎంత ఉండాలో తనకు బాగా తెలుసుని, ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేయొద్దంటూ ఘాటుగా కౌంటరిచ్చారు. 
 
నిజానికి ఇటీవలికాలంలో సమంత తరచుగా వార్తలకెక్కుతున్నారు. లోగడ కూడా ఆరోగ్యానికి సంబంధించి కొన్ని టిప్స్ ఇచ్చింది సమంత. అయితే దీనిపై పెద్ద వివాదామే చేలరేగింది. మయోసైటిస్ వ్యాధికి సంబంధించిన ట్రీట్‌మెంట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. దీనిపై రియాక్ట్ అయిన ఓ డాక్టర్ ఇలాంటివి చెప్తున్న సమంతను జైలులో పెట్టాలని రాసుకొచ్చాడు. ఒక రకంగా వార్నింగ్ ఇచ్చాడు. దీనిపై స్పందించిన సమంత తన డాక్టర్ గైడెన్స్‌లో మాత్రమే తను ఇవన్నీ చేశానని చెప్పుకొచ్చింది. 
 
దీనిపై పలువురు హీరోయిన్లు సైతం రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత సమంతకు ఆ డాక్టర్ సారీ కూడా చెప్పడం జరిగింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో క్యూ అండ్ ఏ సెషన్‌లో భాగంగా అభిమానులు అడిగిన ప్రశ్నల‌కు స‌మాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ సమంత బరువు గురించి ప్రశ్నించాడు. మ‌ళ్లీ బ‌రువు పెర‌గొచ్చు క‌దా అని ఓ నెటిజ‌న్ కామెంట్‌ పెట్టాడు. అయితే ఆ నెటిజన్ చేసిన కామెంట్‌పై సమంత ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
దీనిపై సమంత  మాట్లాడుతూ.. మళ్ళీ బ‌రువు గురించే ప్రశ్న. నా బ‌రువు గురించి నాకు తెలుసు. ప్రస్తుతం నేను చాలా స్ట్రిక్ట్ యాంటీ ఇన్‌ఫ్లమేట‌రీ డైట్‌లో ఉన్నాను. అందువ‌ల్లే నా బ‌రువు ఇలా ఉంది. నా ఆరోగ్య ప‌రిస్థితుల వ‌ల్ల నేను ఇలానే ఉండాలి. ఇత‌రుల‌ను జ‌డ్డ్ చేయ‌డం ఆపండి, బ‌త‌క‌నివ్వండి అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది. సమంత హనీ బన్నీ వెబ్ సిరీస్‌లో నటిచింది. నవంబర్ 7వ తేదీన ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

స్నేహితుడి పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి (video)

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో గెలుపు ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయ్.. బీజేపీ?

లోన్ యాప్‌లు, బెట్టింగ్ సైట్‌ల భరతం పడతాం... హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments