Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత సెట్లోనే కన్నీళ్లు పెట్టుకుంది.. ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 14 నవంబరు 2018 (11:15 IST)
టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత ట్రస్టును నడుపుతున్న సంగతి తెలిసిందే. సినిమాల్లో నటిస్తూ వచ్చిన పారితోషికంతో 'ప్రత్యూష సపోర్ట్' అన్న స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి, ప్రాణాపాయంలో ఉన్న చిన్నారులకు తోచినంత సాయం చేస్తూ, వారికి చికిత్సలను అందించేందుకు సహకరిస్తోంది. 
 
అయితే ఇటీవల సనా అనే పసికందు కాలేయం చెడిపోతే.. తన మిత్రబృందంతో కలిసి రూ.15లక్షలు సేకరించిన సమంత.. ఆ బిడ్డకు చికిత్స చేయించింది. ఆ డబ్బుతో వైద్యులు సనాకు కాలేయాన్ని మార్చినా ఫలితం లేకపోయింది. చికిత్స ఫలించక సనా ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న సమంత.. ఓ సినిమా షూటింగ్ సెట్లోనే కన్నీళ్లు పెట్టుకుంది. 
 
ఈ విషయాన్ని ''ప్రత్యూష సపోర్ట్''లో వాలంటీర్‌గా ఉన్న శశాంతా బినేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సనా చనిపోయిన రోజే సమంత పుట్టిన రోజని ఆమె భావోద్వేగానికి లోనయ్యారని చెప్పారు. ఇప్పటివరకూ తాము 547 మంది చిన్నారులను కాపాడామని, సనా ప్రాణాలు కోల్పోవడం మాత్రం దురదృష్టకరమని తెలిపారు. బినేష్ పోస్టుపై సమంత స్పందిస్తూ, శశాంక పోస్టును రీపోస్ట్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు కానిస్టేబుల్‌ను హత్య చేసి ఠాణాలో లొగిపోయిన ఏఎస్ఐ

సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల నజరానా

ఏపీ లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు - స్వాగతించిన బీజేపీ

అక్రమ సంబంధాన్ని ప్రియుడి భార్యకు చెప్పాడనీ విలేఖరి హత్యకు మహిళ కుట్ర!!

అట్టహాసంగా మహాకాళి అమ్మవారి బోనాలు ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments