Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత ఆ దర్శకుడుతో ప్రేమలో ఉందా? హీరోయిన్ మేనేజరు ఏమంటున్నారు?

ఠాగూర్
శుక్రవారం, 16 మే 2025 (08:44 IST)
కోలీవుడ్ సినీ దర్శకుడు రాజ్ నిడిమోరుతో హీరోయిన్ సమంత పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారనీ, వీరిద్దరూ త్వరలోనే ఒకటికాబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా, రాజ్ నిడిమోరుతో కలిసి దిగిన ఫోటను సమంత షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో వీరిద్దరిపై రూమర్స్ మరోమారు జోరందుకున్నాయి. 
 
పైగా, వీరిద్దరూ భవిష్యత్‌లో కలిసి అడుగులు వేసేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ కొన్ని ఆంగ్ల మీడియాలు కథనాలను కూడా ప్రచురిస్తున్నాయి. అలాగే రాజ్ నిడిమోరు ఇప్పటికే తన భార్యకు విడాకులు ఇచ్చినట్టు కూడా ఆంగ్ల మీడియా తన కథనాల్లో పేర్కొంది. తాజాగా వీటిపై సమంత మేనేజర్ స్పందించారు. అవన్నీ పుకార్లు మాత్రమే. వాటిని ఖండిస్తున్నాం అంటూ పేర్కొన్నారు. 
 
ఇదిలావుంటే, సమంత నిర్మాతగా వచ్చిన "శుభం" చిత్రం విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. అదేసమయంలో తన తొలి సినిమా సక్సెస్ కావడంతో ఆ విజయాన్ని సమంత ఆస్వాదిస్తున్నారు. దీంతో వీరిద్దరూ కలిసి వున్న పలు ఫోటోలను సమంత సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 
'సినిమాను ఆదరించినందుకు అందరికీ కృతజ్ఞతలన్నారు. మా మొదటి అడుగును ప్రేమతో స్వాగతించినందుకు ఎంతో ఆనందంగా ఉంది' అంటూ ఆ ఫోటోలకు సమంత క్యాప్షన్ పెట్టారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందనే అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. కాగా, రాజ్ - డీకేలు సంయుక్తంగా తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్-2, సిటడెల్ - హనీ బన్నీలో సమంత నటించిన సమంత తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీకెంత ధైర్యం.. నా బస్సునే ఓవర్‌టేక్ చేస్తావా.. కండక్టరుపై వైకాపా మాజీ ఎమ్మెల్యే దాడి!!

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments