Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతకు తీరని కోరిక.. ఏంటది..? ఆ దర్శకుడితో తప్పకుండా చేయాల్సిందేనట...

ఎప్పుడూ చలాకీగా ఉంటూ నిజ జీవితంలో నటించడంలో ఒదిగిపోయే నటీమణుల్లో సమంత ఒకరు. అక్కినేని ఫ్యామిలీలో చేరబోతున్న సమంతకు ఒక తీరని కోరిక ఉందట. ఎన్నో సినిమాల్లో ఎన్నో క్యారెక్టర్లు వేసిన సమంతకు ఒక దర్శకుడితో నటించాలన్న కోరిక ఇప్పటికీ అలాగే వుండిపోయిందట. అంతే

Webdunia
శనివారం, 20 మే 2017 (15:28 IST)
ఎప్పుడూ చలాకీగా ఉంటూ నిజ జీవితంలో నటించడంలో ఒదిగిపోయే నటీమణుల్లో సమంత ఒకరు. అక్కినేని ఫ్యామిలీలో చేరబోతున్న సమంతకు ఒక తీరని కోరిక ఉందట. ఎన్నో సినిమాల్లో ఎన్నో క్యారెక్టర్లు వేసిన సమంతకు ఒక దర్శకుడితో నటించాలన్న కోరిక ఇప్పటికీ అలాగే వుండిపోయిందట. అంతేకాదు ఒక క్యారెక్టర్ తాను చేసి ఉంటే ఎంతో బాగుండేదని అనుకున్నదట. ఇప్పటికే సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమంతకు తీరని కోరిక ఉండటం ఆశ్చర్యంగా ఉంది కదూ.
 
తెలుగు చిత్ర పరిశ్రమలో బాహుబలి సినిమా ప్రభంజనం అంతా ఇంతా కాదు. బాహుబలి-2 ఇప్పటికీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఇందులో దేవసేనగా నటించిన అనుష్క క్యారెక్టర్ తాను చేసి ఉంటే బాగుండేదని సమంత తన మనస్సులోని మాటలను స్నేహితులకు చెప్పారట. అది కూడా చిత్తూరు జిల్లాలోని సిద్ధార్థ కళాశాలలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన సమంత తన స్నేహితులతో ఇలా చెప్పిందట. 
 
దర్శకుడు రాజమౌళితో కలిసి పనిచేయాలని.. తెలుగు ప్రేక్షకులు మరిచిపోలేని సినిమాలో నటించాలన్నదే సమంత కోరికట. అయితే సమంత కోరిక నెరవేరుతుందో లేదో గాని దేవసేన క్యారెక్టర్‌లో సమంత నటించి ఉంటే ఎలాగుండేదో మరి.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments