Webdunia - Bharat's app for daily news and videos

Install App

గట్టిగా ఊపిరి పీల్చుకో పాప.. తనకు తాను ధైర్యం చెప్పుకున్న సమంత

Webdunia
శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (18:11 IST)
హీరోయిన్ సమంత తనకు తాను ధైర్యం చెప్పుకుంది. గట్టిగా ఊపిరి పీల్చుకో పాప అంటూ తనకు తాను ధైర్యాన్ని ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. మయోసైటిస్ నుంచి కోలుకుని ఇపుడిపుడే మళ్లీ కెరీర్‌పై దృష్టిసారిస్తున్న సమంత నటించిన 'శాకుంతలం' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. 'సిటాడెల్' ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, ఆమె తన వర్క్‌లైఫ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను ఇన్‌స్టా వేదికగా ఆమె షేర్ చేశారు. ముఖ్యంగా, కొత్త యేడాదిలో తొలినెల జనవరిలో తన జీవితం ఎలా గడిచిందో ఈ ఫొటోలతో ఆమె స్పష్టం చేశారు. 'సిటాడెల్‌' టీమ్‌తో మీటింగ్‌, వర్కౌట్లు, అలసట, ఫొటోషూట్‌లతో గత నెల పూర్తైందంటూనే ఓ ఆసక్తికర పోస్ట్‌తో ఆమె.. తనకు తాను ధైర్యాన్ని ఇచ్చుకునే ప్రయత్నం చేశారు.
 
'గట్టిగా ఊపిరి పీల్చుకో పాప. త్వరలో అన్నీ చక్కబడతాయని నేను నీకు మాటిస్తున్నా. గడిచిన ఏడెనిమిది నెలలుగా నువ్వు అత్యంత ఇబ్బందికరమైన రోజులను చూస్తూ ముందుకు సాగావు. వాటిని మర్చిపోవద్దు. ఆ క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నావో ఎప్పటికీ గుర్తుపెట్టుకో. ఆలోచించడం మానేశావు.. దేనిపైనా దృష్టిపెట్టలేకపోయావు.. సరిగ్గా నడవలేకపోయావు.. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ధైర్యంగా ముందుకు అడుగువేశావు. నీ విషయంలో నేను ఎంతో గర్వంగా ఉన్నా. నువ్వు కూడా నాలాగే గర్వపడు. ధైర్యంగా మరింత ముందుకు సాగిపో' అని సామ్‌ రాసుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments