Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతకు అది చాలా ఇష్టం... నాగచైతన్య (video)

''ఏ మాయ చేసావె'' సినిమాతో తెరంగేట్రం చేసి టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఎదిగిన సమంత ప్రస్తుతం.. అక్కినేని నాగార్జునకు కోడలైన సంగతి తెలిసిందే. తన ప్రియుడు చైతూను పెళ్లాడిన సమంత ప్రస్తుతం వివాహానికి తర్వాత

Webdunia
గురువారం, 12 జులై 2018 (14:23 IST)
''ఏ మాయ చేసావె'' సినిమాతో తెరంగేట్రం చేసి టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఎదిగిన సమంత ప్రస్తుతం.. అక్కినేని నాగార్జునకు కోడలైన సంగతి తెలిసిందే. తన ప్రియుడు చైతూను పెళ్లాడిన సమంత ప్రస్తుతం వివాహానికి తర్వాత కూడా సినిమాలతో బిజీ బిజీగా వుంది. వెండితెరపై విభిన్నపాత్రలను ఎంచుకుంటూ సమంత ముందుకు దూసుకెళ్తుంది. 
 
అయితే ఇటీవల సమంత సినిమాలకు దూరం అవుతుందని, ఆమె చేతిలో వున్న సినిమాలను పూర్తి చేసుకుని.. సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందని వార్తలొచ్చాయి. సమంత గర్భం దాల్చిందని.. ఆ కారణంగా సినిమాలను పక్కనబెట్టేయాలనుకుంటున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలపై చైతూ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. 
 
సినిమాలకి సమంత పూర్తిగా దూరం కానుందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని చైతూ క్లారిటీ ఇచ్చాడు. సమంతకి సినిమాలంటే చాలా ఇష్టమని.. అందుచేత సమ్మూ ఈ రంగానికి దూరం కాదని.. అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు చిన్నపాటి బ్రేక్ తీసుకుంటే తీసుకోవచ్చు కానీ సినిమాలకు దూరం కాదని చైతూ తెలిపాడు. 
 
కాగా.. పెళ్లికి ముందు తర్వాత తెలుగు, తమిళ తెరలపై విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తూ సమంత విజయాలను అందుకుంటూ సమంత ముందుకు సాగుతోంది. పెళ్లికి తర్వాత రంగస్థలం, అభిమన్యుడు వంటి సినిమాలతో హిట్ కొట్టిన సమంత చేతిలో నాలుగు సినిమాలున్నాయని టాక్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షిండే రాజీనామా : మహారాష్ట్ర కొత్త సీఎంగా ఫడ్నవిస్‌కే ఛాన్స్ : అజిత్ పవార్

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments