Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు చైతూకూ పెళ్లి ఎపుడో జరిగిపోయింది.. సమంత

తమ ప్రేమ వివాహంపై నటి సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు అక్కినేని నాగ చైతన్యను ఆమె వివాహమాడనున్న విషయంతెల్సిందే. ఈ వివాహం అక్టోబరు నెలలో జరుగనుంది. ఈ పెళ్లి ఏర్పాట్లు

Webdunia
శనివారం, 12 ఆగస్టు 2017 (10:30 IST)
తమ ప్రేమ వివాహంపై నటి సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు అక్కినేని నాగ చైతన్యను ఆమె వివాహమాడనున్న విషయంతెల్సిందే. ఈ వివాహం అక్టోబరు నెలలో జరుగనుంది. ఈ పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. 
 
ఈ పరిస్థితుల్లో ఆమె తాజాగా ఓ ఇంగ్లీష్ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. చైతూను చూసిన మరుక్షణమే ఆయన ప్రేమలో పడిపోయానని చెప్పింది. 'ఏ మాయ చేశావే' సినిమాతో మొదలైన తమ ప్రేమ ప్రయాణం .. పెళ్లి వరకూ వచ్చిందని అంది. అక్టోబర్లో అందరి సమక్షంలో తమ పెళ్లి జరుగుతుందనీ.. నిజానికి తన మనసులో తమ పెళ్లి ఎప్పుడో జరిగిపోయిందని చెప్పుకొచ్చింది. 
 
వాస్తవానికి చిత్రపరిశ్రమలో ఒక్కో సినిమాకి కొన్ని నెలల పాటు కలిసి పనిచేయవలసి వస్తుంటుంది. ఆ సమయంలో యంగ్ హీరోలు .. హీరోయిన్లు లవ్‌లో పడటం సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ తాము ప్రేమలో ఉన్నట్టుగా వాళ్లు అంత తేలికగా ఒప్పుకోరు. అలాంటిదేం లేదని కొట్టిపారేస్తూ వస్తుంటారు. అయితే, సమంత మాత్రం ఇలాంటివేం లేకుండానే చైతూతో తన ప్రేమ వ్యవహారం గురించి సమంతా చాలా తేలికగా అందరికీ చెప్పేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bihar : పదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. పొదల్లో ఒకరి తర్వాత ఒకరు..?

Milla Magee: మిల్లా మాగీపై వేధింపులు.. క్షమాపణలు చెప్పిన కేటీఆర్.. ఓ ఆడపిల్ల తండ్రిగా ఇలాంటివి?

Covid: బెంగళూరులో తొలి కోవిడ్ మరణం నమోదు.. యాక్టివ్‌గా 38 కేసులు

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి.. మరొకరి పరిస్థితి విషమం

Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments