Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను అర్హురాలినేనా అని ఆత్మ పరిశీలన చేసుకుంటా?: సమంత

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2015 (11:20 IST)
ఒక సినిమా హిట్టైనప్పుడు మంచి పేరు వచ్చినప్పుడు అందరిలా మురిసిపోను.. ఆ హిట్‌కు గుర్తింపుకు తాను అర్హురాలినా అని ముందు తనను తాను విమర్శించుకుంటా. అప్పుడే తనలోని విమర్శకురాలు బయటికొస్తుందని సమంత చెప్పింది. ఓ సినిమా హిట్ కావడమో లేకుంటే ఆ సినిమాలోని పాత్రకు మంచిపేరు రావడమో జరిగినప్పుడు తమకష్టం ఫలించిందని లేదా దీన్ని ముందే ఊహించామని కొందరు చెప్తుంటారు. అయితే వారి ఆనందంలో  వచ్చే మాటల్లో నిజముండదని చెప్తోంది. సినిమానో, పాత్రో హిట్ అయినప్పుడు.. ఆ పాత్రకు గల ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఏమిటనే దానిపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని సమంత అంటోంది. 
 
ఇకపోతే..కెరీర్ ఆరంభం లోనే గోల్డెన్ గర్ల్‌గా పేరు తెచ్చుకున్న సమంత తెలుగు తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూనే వుంది. సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత తెలుగు తెరపై కనపడని ఈ చిన్నది ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాతోపాటు త్రివిక్రమ్ అ.ఆ.. సినిమాలకు సంతకం చేసిన సంగతి తెలిసిందే. 
 
అలాగే తమిళంలోనూ విక్రమ్ - సూర్య లాంటి స్టార్ హీరోలతో నటిస్తోంది. ఆ సినిమాలు తెలుగు తెరపైకి ఎలాగో వస్తాయి. విక్రమ్ హీరోగా తెరకెక్కిన 10 ఎంద్రతుకుల్ల ఈ నెలలోనే విడుదల కానుంది. మిగిలిన సినిమాలు వచ్చే ఏడాది క్యూ కట్టనున్నాయి. ఓ రకంగా సమంత రెండు భాషలు కలుపుకుని 4 సినిమాలను సిద్ధం చేస్తున్నట్టే. ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ వేటికవే ప్రత్యేకమని చెప్తోంది. 

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments