Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత స్మోకింగ్ పిక్చర్స్.. కష్టాల్లో సమ్మూ.. క్షమాపణలు చెప్పాల్సిందేనా?

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2015 (15:07 IST)
సమంత తమిళ సినిమా 10 ఎండ్రదుకుళ్లెపై పాజిటివ్ టాక్ వుంది. ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని సమంత ఇప్పటికే పలుమార్లు వెల్లడించింది. అయితే ఈ సినిమాలోని సమంత స్మోకింగ్ పిక్చర్స్‌ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా నిలిచాయి. బాక్సాఫీసు వద్ద ఈ సినిమాకు మంచి టాక్ వచ్చినా.. ఓ సమంత అభిమాని ఆమె స్మోకింగ్ ఫోటోలను సామాజిక వెబ్ సైట్లలో పోస్ట్ చేశాడు. దీనిపై సమంత కూడా కామెంట్ చేసింది. జస్ట్ ఫన్ కోసమే ఆ సన్నివేశంలో నటించానని క్లారిటీ ఇచ్చింది. ఎంటర్‌టైన్‌మెంట్ వరకే తీసుకోవాలని కూడా చెప్పింది.
 
అయితే తమిళ హిందూ మక్కల్ కట్చి మాత్రం ఈ సినిమాలో సమంత స్మోకింగ్ పిక్చర్స్‌ చూసి షాక్ అయ్యింది. అంతేకాకుండా ఆ సన్నివేశంలో మంచి గుర్తింపున్న హీరోయిన్ సమంత నటించడంపై మండిపడింది. ఇలాంటి సన్నివేశాల్లో సమంత నటించడం ద్వారా యువతలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని సూచించింది. అందుచేత వెంటనే ఆ సీన్స్ తొలగించడంతో పాటు సమంత బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. 
 
సమంత క్షమాపణలు చెప్పకపోతే.. ఇంటిముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్ఎంకే రాష్ట్ర కార్యదర్శి వీర మాణిక్యం శివ ప్రకటించారు. సామాజిక వెబ్ సైట్లలో ఈ ఫోటోలను తొలగించకపోతే.. సమంత ఇంటికి సిగరెట్ ప్యాకెట్స్ పంపుతామని హెచ్చరించారు. పొగతాగడం ద్వారా మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు వ్యాపిస్తున్నాయని శివ సూచించారు. 

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments