Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ ఇండస్ట్రీలో 14 ఏళ్లు పూర్తి చేసుకున్న సమంత రూతు ప్రభు

సెల్వి
సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (11:01 IST)
ఏమాయ చేసావే సినిమాతో తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ సమంతా రూతు ప్రభు సినీ ఇండస్ట్రీలో 14 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అగ్రహీరోయిన్‌గా దక్షిణాదిన ఓ వెలుగు వెలుగుతూ.. బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టిన సమంత ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటోంది. ఇటీవలే అమ్మడు బికినీ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. 
 
నటి మైయోసిటిస్ అనే అరుదైన వ్యాధికి చికిత్స పొందుతూ తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంది. ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సంపాదించింది. తాజాగా సమంత సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 14 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, సన్నిహితులు, కుటుంబీకులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార సమంతకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. 
 
అలాగే ఫిబ్రవరి 26న సమంత రూత్ ప్రభు తన నటనా జీవితంలో 14 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2010లో రొమాంటిక్ సూపర్‌హిట్ చిత్రం ‘ఏ మాయ చేసావే’తో తన మాజీ భాగస్వామి నాగ చైతన్యతో కలిసి నటించింది. సమంతా తన మైయోసైటిస్ నిర్ధారణకు తర్వాత శాకుంతలం, ఖుషి విడుదల తర్వాత పని నుండి విరామం తీసుకుంది. 
 
ప్రస్తుతం వరుణ్ ధావన్‌తో పాటు రాజ్ అండ్ డికెతో కలిసి సిటాడెల్ ఇండియన్ చాప్టర్ కోసం షూట్ చేసింది. ఇంకా ఆమె ఆరోగ్యానికి సంబంధించి టేక్ 20 అనే పాడ్‌కాస్ట్‌ను కూడా హోస్ట్ చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments