Webdunia - Bharat's app for daily news and videos

Install App

యశోదలో యాక్షన్ సీక్వెన్స్‌ల‌లో అల‌రించిన స‌మంత‌

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (18:00 IST)
Samantha- Yasodha
తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన సమంత 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌తో నేషనల్ స్టార్‌గా ఎదిగారు. ఆమె ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా సినిమా 'యశోద'. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. హరి, హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఆగస్టు 12న ఈ సినిమా విడుదల కానుంది.
 
నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ "యశోద'లో సమంత నటనతో పాటు యాక్షన్ సీక్వెన్స్‌ల‌లో ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్‌తో ఆకట్టుకుంటారు. ఆగస్టు 12న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో చిత్రాన్ని విడుదల చేస్తాం. మే నెలాఖరుకు చిత్రీకరణ అంతా పూర్తవుతుంది. యాక్షన్ థ్రిల్లర్ జాన‌ర్‌లో జాతీయ స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కథాంశంతో తెరకెక్కిస్తున్న చిత్రమిది. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్స్‌లో ఇటీవల చిత్రీకరణ ముగిసింది. ఈ రోజు కొడైకెనాల్ లో తాజా షెడ్యూల్ ప్రారంభించాం" అని చెప్పారు.
 
సమంతతో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు ఈ చిత్రం ప్రధాన తారాగ‌ణం.
 
ఈ చిత్రానికి మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి, పాటలు:  చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, క్రియేటివ్ డైరెక్టర్: హేమంబ‌ర్ జాస్తి, కెమెరా: ఎం. సుకుమార్, ఆర్ట్: అశోక్, ఫైట్స్: వెంకట్, యానిక్ బెన్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి, దర్శకత్వం: హరి - హరీష్, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments