టీ గ్రిల్స్ రెస్టారెంట్‌లో చైతూ-సమ్మూ, అఖిల్-శ్రేయా భూపాల్ రిసెప్షన్..
హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లో టీ గ్రిల్స్ రెస్టారెంట్ ప్రారంభమైంది. ఈ రెస్టారెంట్ ఓపెనింగ్‌కు వచ్చిన సమంత మాట్లాడుతూ, తమ వివాహ రిసెప్షన్ ఇందులోనే జరుగుతుందని తెలిపింది. ఈ రెస్టారెంట్‌లో సమంత వాటాలు కూడా
హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లో టీ గ్రిల్స్ రెస్టారెంట్ ప్రారంభమైంది. ఈ రెస్టారెంట్ ఓపెనింగ్‌కు వచ్చిన సమంత మాట్లాడుతూ, తమ వివాహ రిసెప్షన్ ఇందులోనే జరుగుతుందని తెలిపింది. ఈ రెస్టారెంట్‌లో సమంత వాటాలు కూడా ఉన్నాయి. దీంతో సమంత స్నేహితురాలు నీరజ.. నితిన్ స్నేహితుడు అఖిల్ కనుక ఇందులోనే రిసెప్షన్ జరిగే అవకాశం ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్‌లో సమంత, నాగచైతన్యల ప్రేమ కథే హాట్ టాపిక్.
ఇదిలా ఉంటే.. అక్కినేని వారిట్లో పెళ్లిసందడి మొదలైంది. అన్న నాగచైతన్య కంటే ముందే తమ్ముడు అఖిల్ పెళ్లికి రెడీ అయిపోయాడు. డిసెంబర్ నెలలో అఖిల్, శ్రేయాభూపాల్‌ల నిశ్చితార్థానికి ఇప్పటినుండే భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక పెళ్లిని కూడా విదేశాల్లో ప్లాన్ చేశారు. అయితే వీరి పెళ్లితో పాటు నాగచైతన్య, సమంత పెళ్లి విషయంలో కూడా అక్కినేని ఫ్యామిలీ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. చైతు, సమంతల పెళ్లి 2017 ఆగస్ట్‌లో నిర్వహించాలని భావిస్తున్నారట.