Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తయ్యతో ఎంతో సంతోషంగా గడిపాను.. సమంత

Webdunia
బుధవారం, 27 మార్చి 2019 (10:52 IST)
పెళ్లికి ముందు కంటే అక్కినేని ఇంటికి కోడలు అయిన తర్వాత సమంత పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌లో చాలా సంతోషంగా ఉంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే సమంత ఎప్పటికప్పుడు తాజా విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువగానే ఉంది. 
 
ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అత్త లక్ష్మి దగ్గుబాటి, భర్త నాగచైతన్యలతో కలిసి తీసుకున్న ఓ పిక్చర్ షేర్ చేసింది. సాధారణంగా బయట చాలా తక్కువగా కనిపించే లక్ష్మి దగ్గుబాటి కూడా ఈ  ఈ ఫోటోలో సమంతో పాటు ఉండటంలో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇందులో మరో విశేషమేమింటంటే అత్తాకోడళ్లు ఒకే రకంగా ఉన్న డ్రెస్ వేసుకుని ఉండటంతో అభిమానులు బాగా ఆకర్షితులవుతున్నారు. ఈ ఫోటోను జయపురలో జరిగిన వెంకటేష్ కూతురి పెళ్లి‌లో తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
 
సమంత ఈ ఫోటోను పోస్ట్ చేస్తూ.. ‘మా అత్తయ్యతో ఎంతో సంతోషంగా గడిపా.. ఒకేరోజు ఒకే రకమైన డ్రెస్‌తో తయారై బయటికి వచ్చాం (అయితే ఇదేం ముందుగా ప్లాన్‌ చేసుకొన్నది కాదు). దీన్ని ఖచ్చితంగా నమ్మాలి. సాధారణంగా అబ్బాయిలు తమ అమ్మలాంటి వ్యక్తి భార్యగా రావాలని కోరుకుంటారు, అనుకోకుండా ఇప్పుడు అది నిజమైంది’’ అని ట్యాగ్ చేసింది. ఈ మాట ద్వారా చైతుకి తాను, తన అమ్మ ఇద్దరం ఎంతో ముఖ్యమని చెప్పకనే చెప్పింది సామ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments