Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకుతో ఎంజాయ్ చేస్తున్న సమంత, చైతూ దంపతులు.. ఫోటోలు వైరల్

Webdunia
సోమవారం, 11 నవంబరు 2019 (12:04 IST)
సమంత అక్కినేని, నాగ చైతన్యలకు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. అలా వీరిద్దరూ యష్ అనే శునకాన్ని పెంచుకుంటున్నారు. తాజాగా సమంత తన కొడుకు యష్ అక్కినేని అల్లరిని తెగ ఎంజాయ్ చేస్తోంది.

వాడికి స్నానాలు చేయించడం, యష్‌తో ఆడుకోవడం అంతేకాదు వాడి అల్లరిని కెమెరాలో బందించి ఆ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం చేస్తోంది. దానికి సంబందించిన ఫోటోస్‌ను సమంత ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటోంది. ఆ కుక్క పిల్ల కూడా సూపర్ క్యూట్ ఉండి నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది.
 
'ఏమాయ చేశావే' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సమంత.. ఆ సినిమా హీరో చైతూనే ప్రేమించి వివాహం చేసుకుంది. ఇటీవల ఈ భామ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతున్నాయి. తన భర్త నాగ చైతన్యతో పెళ్లి తర్వాత కలిసి నటించిన ‘మజిలీ’ సినిమా ఈ యేడాది మొదట్లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్స్‌ను రాబట్టింది. 
 
ఆ తర్వాత సమంత ఓ కొరియన్ రీమేక్‌లో నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ఓ బేబి’ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్‌ను రాబట్టింది. సమంత ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న తమిళ సినిమా '96' రీమేక్‌లో శర్వానంద్‌కు జోడిగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తైంది. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. తెలుగులో సమంత, శర్వానంద్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments