Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏసీ జిమ్‌లో నాగచైతన్య - సమంతకు చెమటలు.. ఏం చేశారో ఈ వీడియో చూండండి

ఓవైపు ఏసీ జిమ్. మరోవైపు చెమట్లు కారిపోయేలా కుస్తీ. ఇది త్వరలో పెళ్లి పీటలెక్కనున్న హీరో, హీరోయిన్ సమంత చేసిన వ్యాయామాలు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో లీక్ చేయొద్దంటూ చైతూ మొత్తుకున్నప్పటి

Webdunia
ఆదివారం, 28 మే 2017 (10:06 IST)
ఓవైపు ఏసీ జిమ్. మరోవైపు చెమట్లు కారిపోయేలా కుస్తీ. ఇది త్వరలో పెళ్లి పీటలెక్కనున్న హీరో, హీరోయిన్ సమంత చేసిన వ్యాయామాలు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో లీక్ చేయొద్దంటూ చైతూ మొత్తుకున్నప్పటికీ.. సమంత మాత్రం పట్టించుకోలేదు. ప్లీజ్.. చైతూ.. ఇదొక్కటే.. ఈ ఒక్కసారికేనంటూ కాకాపట్టి.. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇది ఇపుడు వైరల్‌గా మారింది. 
 
ఇటీవల నాగచైతన్య, సమంత ఇద్దరూ కలిసి వ్యాయామశాలకు వెళ్లారు. అక్కడ చాలా ఫీట్లే చేశారు. ఆ సమయంలో ఫోటోలు, వీడియోలు తీశారు. దీనికి సంబంధించిన ఫోటో, వీడియోలు సమంత ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసింది. అయితే తాజాగా జిమ్‌లో చైతన్య వర్కవుట్‌కు సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేసింది. 
 
సాధారణంగా తనకు సంబంధించిన ఫోటోలు కానీ, వీడియోలు కానీ బయటకు రావడానికి ఇష్టపడని చైతూ.. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి తొలుత ససేమిరా అన్నాడట. అయితే సమంత మాత్రం చైతును చాలా బలవంతం చేసి, బతిమాలి చివరికి ఒప్పించిందట. 
 
చైతన్య ఒప్పుకోవడమే ఆలస్యం.. తాను, చైతన్య జిమ్‌లో చేసిన వర్కవుట్‌కు సంబంధించి రెండు వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసేసింది. ఈ వీడియోల్లో చైతన్య 161 కేజీల బరువును ఎత్తగా, సమంత 90 కేజీల బరువును ఎత్తేసింది. ఏదేమైనా ఫిట్‌నెస్ కోసం ఈ లవ్లీ కపుల్ చాలానే కష్టపడుతోందని చెప్పాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments