Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతతో సినిమా చేస్తున్నాను.. కారులో కలిసి వెళ్తున్నాం ఫోటో చూడండి: చైతూ

''ఏ మాయ చేసావె'' సినిమాతో తెరంగేట్రం చేసిన జంట సమంత, నాగచైతన్య. ఈ ప్రేమ జంట రియల్ లైఫ్‌లో భార్యాభర్తలుగా మారిపోయింది. పెళ్లితో ఏకమైన ఈ జంట.. త్వరలోనే వెండితెరపై కనిపించనుంది. పెళ్లికి ముందు ఆటో నగర్ స

Webdunia
శనివారం, 17 మార్చి 2018 (15:23 IST)
''ఏ మాయ చేసావె'' సినిమాతో తెరంగేట్రం చేసిన జంట సమంత, నాగచైతన్య. ఈ ప్రేమ జంట రియల్ లైఫ్‌లో భార్యాభర్తలుగా మారిపోయింది. పెళ్లితో ఏకమైన ఈ జంట.. త్వరలోనే వెండితెరపై కనిపించనుంది. పెళ్లికి ముందు ఆటో నగర్ సూర్య, మనం వంటి సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట.. పెళ్లికి తర్వాత కూడా స్క్రీన్‌పై కనిపించనుంది.  
 
నిన్ను కోరి డైరెక్టర్ శివ నిర్వాణ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న సినిమాలో సామ్, చైతు జంట కలిసి నటించనుంది. ఈ సినిమాకు ''ప్రేయసి'' అనే టైటిల్‌ని చిత్ర యూనిట్ ఖరారు చేసినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగింది.
 
ఈ నేపథ్యంలో నాగచైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో ''సవ్యసాచి'' సినిమా చేస్తున్నాడు. ఇక మారుతి దర్శకత్వంలో ''శైలజా రెడ్డి అల్లుడు'' సినిమా చేస్తున్నాడు. ఈ రెండూ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్నాయి. తాజాగా శివ నిర్వాణతో మరో సినిమా చేయడానికి చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ చిత్రంలో హీరోయిన్ సమంతానేనని చైతూ ట్వీట్ కూడా చేశాడు. 
 
శనివారం ఈ సినిమా పనులు కూడా ప్రారంభమయ్యాయి. 'ఈరోజు కచ్చితంగా కొత్త రోజని.. చాలా కొత్తరోజని.. సమంతతో కలిసి వర్క్ చేసేందుకు వెళ్తున్నానని' సమంతతో కలిసి కారులో వెళ్తోన్న సెల్ఫీని చైతూ ట్విట్టర్లో పోస్టు చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments