Webdunia - Bharat's app for daily news and videos

Install App

చై-సామ్ వైవాహిక జీవితం!.. ఎందుకో ఈ విడాకులు!?

Webdunia
శనివారం, 2 అక్టోబరు 2021 (18:02 IST)
చైతూ-సమంత మేడ్ ఫర్ ఈచ్ అదర్… అనేది టాలీవుడ్‌లో ఒక లవ్‌లీ స్లోగన్‌గా మారిపోయింది. చైతూ తన మతం కాదు.. కానీ.. చైతూ అభిమతమే తన మతంగా మార్చుకుంది సమంత. తెలుగు మదర్‌కీ, మలయాళీ ఫాదర్‌కీ పుట్టిన సామ్… తనకు ఫలానా మతస్థుడే కావాలని ఎప్పుడూ అనుకోలేదు. అందుకే చైతూతో చివరిదాకా నడవాలన్న నిశ్చయం ఆమె మనసులో నాటుకుపోయింది. వాళ్లిద్దరి అన్యోన్యానికి ఆనవాళ్లు ఎన్నంటే బోలెడన్ని.
 
నాలుగేళ్ల పాటు పిల్లాపాపల్లేకపోయినా.. చైతూనే తన పిల్లాడుగా ఫీలయ్యేది సమంత. తను కట్టుకునే చీర మీదున్న డిజైన్‌ కూడా చైతూతో వైవాహిక బంధానికి రుజువు లాంటిది. ఒంటిమీది టూటూలు చెప్పేది కూడా చైతన్య మీద సమంతకున్న ప్రేమపాఠమే. 
 
నాలుగేళ్ల సమంత వైవాహిక జీవితం… అక్కినేని పరివారంతో ఆమె ఎంతగా కలిసిపోయిందో తెలియజెప్పింది. లాస్ట్ ఇయర్ దగ్గుబాటి వారింట జరిగిన రానా పెళ్లిలో సందడంతా సమంతాదే. అక్కినేని కుటుంబం తరఫున నేనే మెయిన్ రిప్రజెంటేటివ్‌ని అనే రేంజిలో కలివిడిగా కనిపించారు సమంత.
 
చైతూ సినిమాలు రిలీజైనప్పుడు డైరెక్ట్‌గానో, ఇన్‌డైరెక్ట్‌గానో ప్రమోషన్‌లో ముందుంటారు సమంత. ఆ విధంగా సహధర్మచారిణి అనే హోదాను పూర్తిస్థాయిలో ఫుల్‌ఫిల్ చేశారు సమంత. లాల్‌సింద్ చద్దా సినిమా షూటింగ్‌ కోసం చై నార్త్‌లో వుంటే.. సౌత్ నుంచి హాయ్ అంటూ తియ్యగా పలకరించారు సమంత. మామా అంటూ నాగార్జునకు ప్రేమపూర్వక పలకరింతలు దక్కాయి సమంత నుంచి. కానీ ఎందుకో సమంత-చైతూల వివాహ బంధానికి విడాకుల ద్వారా బ్రేక్ పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments