Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలిని బీట్ చేసిన సల్మాన్ : Rs. 400కోట్ల మార్కును దాటిన బీబీ! సన్ Vs డాడ్..!!

Webdunia
సోమవారం, 27 జులై 2015 (17:13 IST)
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ బజ్‌రంగీ భాయ్‌జాన్‌ (బీబీ) బాహుబలిని అధిగమించింది. రికార్డుల పరంగా రూ.400 కోట్ల మార్కును నమోదు చేసుకున్న బాహుబలిని... బజ్‌రంగీ భాయ్‌జాన్‌ రూ. 425కోట్లతో వెనక్కి నెట్టింది. అద్భుతమైన కథతో సల్మాన్ నటించిన బజ్‌రంగీ భాయ్‌జాన్‌ ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు కొట్టేసింది. ఒక్కవారంలో రూ. 184 కోట్లు సంపాదించేసిన బజ్‌రంగీ భాయ్‌జాన్‌, రెండో శుక్రవారానికి మరో 54 కోట్ల రూపాయలను సంపాదించింది. 
 
ఇక శని, ఆదివారాలతో కలిపి దేశ వ్యాప్తంగా రూ.284 కోట్ల మేర కలెక్షన్స్ సాధించింది. అదే ప్రపంచ వ్యాప్తంగా బజ్‌రంగీ భాయ్‌జాన్‌ సినిమాకు రూ.425 కోట్లు తన ఖాతాలో వేసుకుంది. ఇకపోతే.. షారూఖ్ ఖాన్ చెన్నై ఎక్స్‌ప్రెస్ రూ.428 కోట్లు, ధూమ్ 435-40 వరకు సాధించగా.. అమీర్ రికార్డును బద్ధలు చేసేందుకు బజ్‌రంగీ భాయ్‌జాన్‌ ద్వారా సల్మాన్ రెడీ అవుతున్నట్లు తెలిసింది. 
 
ఇకపోతే.. ప్రపంచ వ్యాప్తంగా వివిధ వెర్షెన్‌లలో బాహుబలి 17 రోజులకు రూ.385 కోట్లు సాధించగా, అదే బజ్‌రంగీ భాయ్‌జాన్‌ పది రోజుల్లోనే రూ.385 కోట్లను తన ఖాతాలో వేసుకుందని సమాచారం. దీంతో సల్మాన్ పండగ చేసుకుంటున్నాడు. ఇకపోతే.. భజరంగీ భాయ్‌జాన్ సినిమా ఎస్. ఎస్. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందించిన కథతోనే తెరకెక్కడంతో.. నాన్న రాసిన కథతో ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ వర్షం కురిపించడంతో జక్కన్న హ్యాపీగా ఉన్నాడు.

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments