Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆద్యగా వస్తోన్న శ్రుతిహాసన్.. సలార్ పోస్టర్ విడుదల

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (12:47 IST)
salaar sruthi
విశ్వనటుడు కమల్‌హాసన్‌ నట వారసురాలిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతిహాసన్‌ అతికొద్దికాలంలోనే హీరోయిన్‌గా మంచి క్రేజ్‌ను దక్కించుకుంది. తెలుగు, తమిళ భాషల్లో స్టార్‌ హీరోలతో నటించి ఒకానొక క్రమంలో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. 
 
అయితే ఉన్నట్టుండి ఏమైందో తెలియదు కానీ వరుసగా ఆమెకు అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తనకు సినిమా అవకాశాలు తగ్గిపోవడానికి గల కారణాలను తాజాగా శృతిహాసన్‌ వెల్లడించింది.
 
‘ప్రతీ రంగంలోనూ మంచి చెడు అనేవి రెండూ ఉంటాయి. అలాంటప్పుడు సినిమా ఇండస్ట్రీనే అందరూ వేలెత్తి చూపడం కరెక్ట్‌ కాదు. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలి నాళ్లలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడ్డాను. ఎదుటివారి ఎలాంటి వారైనా, వారి వయసులో ఎంత పెద్ద వారైనా,, వాళ్లు గతంలో చేసిన చిత్రాలతో సంబంధం లేకుండా నాకు క్యారెక్టర్‌ నచ్చకపోతే మొహం మీదే చెప్పేస్తా. దీంతో ఎన్నో సినిమా అవకాశాలను పోగొట్టుకున్నా. 
 
ఎంత కష్టంలో ఉన్నా వ్యక్తిత్వాన్ని, స్వాభిమానాన్ని చంపుకొని బతకడం నాకు నచ్చదు’ అంటూ శృతిహాసన్‌ పేర్కొంది. ఇప్పటికే 'క్రాక్' హిట్ ద్వారా గాడిలో పడిన శ్రుతిహాసన్.. ఆ తర్వాత సలార్ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
 
ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్ కి ఛాన్స్ దొరకడం నిజంగా ఆమె అదృష్టమే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది గనుక, తన కెరీర్ మరింత పుంజుకుంటుందనే బలమైన నమ్మకంతో ఆమె ఉంది. 
 
ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఆమె 'ఆద్య' అనే పాత్రలో కనిపించనుందని చెబుతూ, ఆమె లుక్‌కి సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా ఈ పోస్టర్‌లో శ్రుతిహాసన్ కనిపిస్తోంది. ఇక బాలకృష్ణ - గోపీచంద్ మలినేని సినిమాలోను, చిరంజీవి - బాబీ ప్రాజెక్టులోను నాయికగా ఆమె పేరే వినిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

ఆవు - పాము స్నేహం.. నెట్టింట వీడియో వైరల్

శ్రీతేజ్‌ మెదడుకు డ్యామేజీ జరిగిందంటున్న వైద్యులు.. (Video)

ఎట్టకేలకు డిప్యూటీ సీఎం పవన్‌కు కలిసిన యువ రైతు.. సమస్యలపై వినతిపత్రం (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments