Webdunia - Bharat's app for daily news and videos

Install App

శర్వానంద్ 37 సినిమాలో సాక్షి వైద్య పరిచయం

డీవీ
బుధవారం, 19 జూన్ 2024 (17:45 IST)
Sakshi Vaidya
చార్మింగ్ స్టార్ శర్వానంద్ కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ అప్ లో ఉంచారు.  ఇటీవల 'మనమే'తో అలరించిన శర్వా ఇప్పుడు తన నెక్స్ట్ 37వ సినిమా  షూటింగ్‌లో బిజీగా వున్నారు. సెన్సేషనల్ హిట్ సామజవరగమన ని అందించిన రామ్ అబ్బరాజు ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామబ్రహ్మం సుంకర ఈ ఎంటర్టైనింగ్  మూవీని  నిర్మిస్తున్నారు.
 
మేకర్స్ ఈ రోజు వెరీ ట్యాలెంటెడ్ హీరోయిన్ సాక్షి వైద్యను బోర్డులోకి స్వాగతించారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమెను నిత్యగా  పరిచయం చేశారు. ఈ చిత్రంలో ఆమె ఆర్కిటెక్ట్‌గా కనిపిస్తుంది.  శర్వాతో జతకడుతోంది. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది.
 
టాప్ టెక్నిషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తుండగా, జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. భాను బోగవరపు కథ అందించగా, నందు సవిరిగాన డైలాగ్స్ రాస్తున్నారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. అజయ్ సుంకర సహ నిర్మాత కాగా, కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
 నటీనటుల మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో ఎనౌన్స్ చేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళలను దూషించడమే హిందుత్వమా? మాధవీలత

నిమిష ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేసిన యెమెన్

గండికోటలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య - అతనే హంతకుడా?

హాస్టల్‌లో ఉండటం ఇష్టంలేక భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

భర్తను హత్య చేయించి.. కంట్లో గ్లిజరిన్ వేసుకుని నటించిన భార్య...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments