Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కినేని అఖిల్ ఏజెంట్ నుండి సాక్షి వైద్య లుక్

Webdunia
సోమవారం, 20 జూన్ 2022 (07:28 IST)
Sakshi Vaidya
అక్కినేని అఖిల్ హీరోగా స్టయిలీష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ 'ఏజెంట్. స్టయిలీష్ స్పై థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న 'ఏజెంట్' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
 
హై వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంతోనే ఆమె టాలీవుడ్ లో అడుగుపెడుతుంది. సాక్షి వైద్య పుట్టిన రోజు సందర్భంగా ఆమె స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. బర్త్ డే స్పెషల్ పోస్టర్ లో.. లవ్లీ స్మైల్ తో క్రాప్డ్ స్వెట్ షర్ట్, జీన్స్ లో చాలా అందంగా, స్టయిలీష్ గా కనిపించింది సాక్షి వైద్య. కూల్ అండ్ ప్లజంట్ గా కనిపించి అందరి ద్రుష్టిని ఆకర్షించింది.
 
ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.  ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించారు.
ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతం అందించగా, రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహకుడిగా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
అజయ్ సుంకర, దీపా రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 12న విడుదలకు సిద్ధమౌతుంది.
 
తారాగణం: అక్కినేని అఖిల్, సాక్షి వైద్య, మమ్ముట్టి
సాంకేతిక విభాగం :
దర్శకత్వం: సురేందర్ రెడ్డి
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
సహ నిర్మాతలు: అజయ్ సుంకర, దీపా రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి
బ్యానర్లు: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా
కథ: వక్కంతం వంశీ
సంగీతం: హిప్ హాప్ తమిళ
డీవోపీ : రసూల్ ఎల్లోర్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్లా
స్టంట్స్: విజయ్ మాస్టర్, స్టంట్ శివ

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PV Sindhu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు, వెంకట సాయి.. (video)

Telangana: భర్తను చెల్లెలి సాయంతో హత్య చేసిన భార్య.. ఎందుకు ?

జనవరి 31 నుంచి అరకు ఉత్సవాలు.. మూడు రోజుల జరుగుతాయ్

తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలి: కొండా సురేఖ

కుమార్తె వచ్చాకే డాక్టర్ మన్మోహన్ అంత్యక్రియలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments