Webdunia - Bharat's app for daily news and videos

Install App

''సైరాట్'' హీరోయిన్ రింకు ఫస్ట్ క్లాస్‌లో పాసైంది: హిందీ రీమేక్‌లో శ్రీదేవి కుమార్తె జాహ్నవి?

''సైరాట్'' హీరోయిన్ రింకు పదో తరగతిలో ఫస్ట్ క్లాస్‌లో పాసైంది. మరాఠా, తెలుగు భాషల్లో రూపొందిన సైరాట్ సినిమా సినీ చరిత్రలో అద్భుత కావ్యంగా నిలిచిపోయింది. ఇంకా రూ.100 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ నేపథ్యం

Webdunia
బుధవారం, 14 జూన్ 2017 (12:51 IST)
''సైరాట్'' హీరోయిన్ రింకు పదో తరగతిలో ఫస్ట్ క్లాస్‌లో పాసైంది. మరాఠా, తెలుగు భాషల్లో రూపొందిన సైరాట్ సినిమా సినీ చరిత్రలో అద్భుత కావ్యంగా నిలిచిపోయింది. ఇంకా రూ.100 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ నేపథ్యంలో పదో తరగతి చదివిన రింకు.. ప్రైవేటుగా పరీక్షలు రాసింది. తాజాగా మహారాష్ట్ర సర్కారు విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో 66.40శాతం మార్కులతో పాటు ఫస్ట్ క్లాసులో పాసైంది. 
 
అత్యధికంగా హిందీలో 87 మార్కులు సాధించింది. మాతృభాష మరాఠీలో 83 మార్కులు సాధించింది. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలోని అక్లుంజ్ అనే ఓ చిన్న పట్టణానికి చెందిన రింకూ (17) అదే ప్రాంతానికి చెందిన పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తోంది. అయితే సైరాట్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ రావడంతో అమ్మడు ప్రైవేటుగా పరీక్షలు రాసింది. దీంతో పదో తరగతి పరీక్షల్లో ఫస్ట్ క్లాస్‌లో పాసైంది.   
 
ఇక సైరాట్ సినిమా గురించి చెప్పాలంటే.. 'ప్రేమిస్తే' సినిమా పోలికల్లో ఉండే ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఇందులో నటించిన ఆకాష్, రింకులకు కూడా మంచి పేరు వచ్చింది. ఈ సినిమాను కన్నడ, తమిళ, మలయాళ, హిందీ, తెలుగు భాషల్లో రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హిందీలో ప్రముఖ నటి శ్రీదేవి కుమార్తె జాహ్నవిని ఈ సినిమా రీమేక్‌తో బాలీవుడ్ అరంగేట్రం చేయించేందుకు ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోపు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

టీవీ యాంకర్‌కు నిద్రమాత్రలు కలిపి... లైంగికదాడికి పాల్పడిన పూజారి!!

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments