Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిరామ్ శంక‌ర్ - రీసౌండ్- ఫ‌స్ట్ లుక్

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (13:15 IST)
Resound First Look
కొంత విరామం త‌ర్వాత హీరో సాయి రామ్ శంకర్ ఒక ప‌ర్‌ఫెక్ట్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాతో మ‌న ముందుకు వ‌స్తున్నారు. ఎస్ఎస్ మురళీ కృష్ణ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ మూవీలో రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అరవింద్ కృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు.
 
ఈరోజు సాయి రామ్ శంకర్ పుట్టినరోజు సందర్భంగా, సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి `రీసౌండ్` అని ప‌వ‌ర్‌ఫుల్‌ మాస్-అప్పీలింగ్ టైటిల్ ఖ‌రారు చేశారు. స్టార్ డైరెక్టర్స్ గోపీచంద్ మలినేని, బాబీ `రీసౌండ్‌` ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు.
 
ఇక ఫస్ట్ లుక్ విష‌యానికి వ‌స్తే సాయి రామ్ శంక‌ర్ బీడీ తాగుతూ పోలీస్ స్టేష‌న్‌లో కుర్చీలో కూర్చుని ఉన్నారు. అంత‌కు ముందు పోలీసుల‌తో ఘ‌ర్ష‌న జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. టైటిల్ కు త‌గ్గ‌ట్టుగా ఈ ఫ‌స్ట్ లుక్‌ పోస్ట‌ర్ కూడా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో సాయి రామ్ శంకర్ యాక్షన్-ప్యాక్డ్ రోల్ ఎలా ఉంబోతుందో ఈ పోస్ట‌ర్‌ సూచిస్తుంది
 
శ్రీ అముర‌త హరిణి క్రియేషన్స్, శ్రీ శరణం అయ్యప్ప క్రియేషన్స్, రియల్ రీల్ ఆర్ట్స్ ప‌తాకాల‌పై
జె. సురేష్ రెడ్డి, బి అయ్యప్ప రాజు, ఎన్‌విఎన్ రాజా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కీల‌క పాత్ర‌ల్లో  ప్ర‌ముఖ న‌టీన‌టులు న‌టిస్తున్నారు.
స్వీకర్ అగస్తి సంగీత ద‌ర్శ‌కత్వం వ‌హిస్తుండ‌గా సాయిప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ భాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. సాగర్.యు ఎడిటర్‌.   ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
 
తారాగణం: సాయి రామ్ శంకర్, రాశి సింగ్, అరవింద్ కృష్ణ, పోసాని కృష్ణ మురళి, అజయ్ గోష్, కాశి విశ్వనాథ్, అదుర్స్ రఘు, పింకీ (సుదీప), వేణు, లావణ్య రెడ్డి, పవన్ సురేష్, రాజా రెడ్డి, యామిని, శ్రీనివాస్ సాగర్, మణివర్ధన్ తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments