Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా మనసుకు దగ్గరైన చిత్రం సైంధవ్ - విక్టరీ వెంకటేష్

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2023 (18:37 IST)
Venkat Boyanapalli, Venkatesh, Shailesh kolanu
విక్టరీ వెంకటేష్ 75వ ల్యాండ్‌మార్క్ చిత్రం ‘సైంధవ్’ 2024లో విడుదలవుతున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లలో ఒకటి. వెరీ ట్యాలెంటెడ్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ‘సైంధవ్ టీజర్ కు నేషనల్ వైడ్ గా ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.
 
ఈ రోజు ‘సైంధవ్’ ఫస్ట్ సింగిల్ 'రాంగ్ యూసేజ్' ని సిఎంఆర్, విఎన్ఆర్ కాలేజీల్లో నిర్వహించిన ఈవెంట్స్ లో లాంచ్ చేసి మేకర్స్ చాలా గ్రాండ్ గా మ్యూజికల్ జర్నీని స్టార్ట్ చేశారు. సాంగ్ లాంచ్ ఈవెంట్స్ లో భారీగా హాజరైన విద్యార్ధులతో కలసి సందడి చేశారు విక్టరీ వెంకటేష్. రాంగ్ యూసేజ్ పాటకు వేదికపై వెంకటేష్ డ్యాన్స్ చేయడం ప్రేక్షకులని, విద్యార్ధులని అలరించింది.    
 
సంతోష్ నారాయణన్ ఈ పాట కోసం ఎక్స్ ట్రార్డినరీ క్యాచి నెంబర్ కంపోజ్ చేశారు. నకాష్ అజీజ్ తన ఎనర్జిటిక్ వోకల్స్ తో ఆకట్టుకున్నారు. ఆస్కార్ విన్నింగ్ లిరిసిస్ట్ చంద్రబోస్ రాసిన లిరిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డబ్బు, ప్రేమ, మనుషులు గురించి రాసిన అర్ధవంతమైన సాహిత్యం ఆడియన్స్ ని అలరించింది.
 
ఈ పాటలో వెంకటేష్ మాస్ వైబ్ ప్రేక్షకులని కట్టిపడేసింది. మాస్ డ్యాన్స్ మూమెంట్స్ మెస్మరైజ్ చేశారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి. మొత్తానికి రాంగ్ యూసేజ్ పాట ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా అలరించింది.
 
వెంకటేష్ మాట్లాడుతూ.. ముఫ్ఫై ఐదేళ్ళుగా సినీ ప్రయాణం కొనసాగుతోంది. నా మొదటి సినిమా వచ్చినపుడు ఇక్కడ వున్న విద్యార్ధుల పేరెంట్స్ చూసుంటారు. వాళ్లకు నా సినిమాలు నచ్చాయి. ఇప్పుడు మీ జనరేషన్ వచ్చింది. మీ అందరికీ నా చిత్రాలు నచ్చడం చాలా అనందంగా వుంది. నేను తొలినాళ్ళలో చేసిన చిత్రాలు మీ పేరెంట్స్ చూసుంటారు. కానీ మీ జనరేషన్ వాళ్లు''ఆడవాళ్ళ మాటలకు అర్ధాలే వేరులే, సీతమ్మ వాకిట్లో, గోపాలగోపాల, గురు, నారప్ప, దృశ్యం, ఎఫ్ 2, ఎఫ్ 3 లాంటి చిత్రాలని చూశారు. ఎంతగానో ఆదరించారు. మీ ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు. సైంధవ్ నా 75వ చిత్రం. చాలా ప్రత్యేకమైనది. నా మనసుకు దగ్గరైన చిత్రం. నిర్మాత వెంకట్ గారు చాలా గ్రాండ్  నిర్మించారు. దర్శకుడు శైలేష్ అద్భుతంగా తెరకెక్కించారు. తనతో వర్క్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. సంతోష్ నారాయణ్, డీవోపీ మణికందన్ బ్రిలియంట్ వర్క్ ఇచ్చారు. ఈ సినిమా ఒక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్. యాక్షన్ చాలా న్యూ ఏజ్ గా వుంటుంది. యాక్షన్ ఎమోషన్ చాలా ఎక్స్ ట్రార్డినరీగా వచ్చింది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. జనవరి 13నసినిమా విడుదలౌతుంది. తప్పకుండా సినిమాని ఆదరిస్తారనే నమ్మకం వుంది. రాంగ్ యూసేజ్ పాటలో డబ్బు, మనుషులు, స్నేహం గురించి చాలా మీనింగ్ ఫుల్ లిరిక్స్  వున్నాయి. లిరిక్స్ ని చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా అద్భుతమైన చిత్రం చేశాం. పండక్కి ఫ్యామిలీతో కలిసి అందరూ ఎంజాయ్ చేస్తారు'' అన్నారు  
 
డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. సైంధవ్ వెంకీ 75.. ఒక లెజెండరీ యాక్టర్ 75వ చిత్రం ఎలా ఉండాలో అలా తీశా. హిట్ 1 , హిట్2 చిత్రాలు మీ అందరికీ నచ్చాయి. ఇప్పటివరకూ నేను చేసిన చిత్రాలలో బెస్ట్ వర్క్ సైంధవ్. సినిమా చాలా బావుటుందని నమ్మకంగా చెబుతున్నా థియేటర్ కి వెళ్లి చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు. రాంగ్ యూసేజ్ పాటలో మనకి బాగా దగ్గరరైన గ్రామర్ లో మెసేజ్ చెప్పాం. లిరిక్స్ వింటే చాలా ఎంజాయ్ చేస్తారు'' అన్నారు.
 
నిర్మాత వెంకట్ బోయనపల్లి మాట్లాడుతూ.. సైంధవ్ వెంకీ 75.. జనవరి 13న విదుదలౌతుంది. అందరూ థియేటర్ లో చూడాలి'' అని కోరారు.  
 
సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ మాట్లాడుతూ.. దసరా చిత్రం తర్వాత మీ అందరినీ కలవడం ఆనందంగా వుంది. తెలుగులో 'సైంధవ్' తో పాటు కల్కి సినిమా కూడా చేయడం చాలా ఆనందంగా వుంది. 'సైంధవ్' అద్భుతమైన చిత్రం. వెంకటేష్ గారిని చాలా కొత్తగా చూస్తారు. తప్పకుండా సినిమా మీ అందరికీ నచ్చుతుంది'' అన్నారు.  
 
డీవోపీ మణికందన్ మాట్లాడుతూ.. వెంకటేష్ గారిది వేరే కేవల్ ఎనర్జీ. ఈ పాట రాత్రి రెండు గంటలకి చిత్రీకరించాం. అప్పుడు కూడా ఆయన ఫుల్ ఎనర్జీ లో వున్నారు. మా యూనిట్ అందరిలో ఎనర్జీ నింపారు. ఈ సినిమా ఎక్స్ ట్రార్డినరీ గా వుంటుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది.జనవరి 13న సిద్ధంగా వుండండి '' అన్నారు.  
 
నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.మణికందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్, గ్యారీ బిహెచ్ ఎడిటర్.
 
నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, బేబీ సారా, జయప్రకాష్‌లు ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం. కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత.
 
‘సైంధవ్’ జనవరి 13, 2024న అన్ని దక్షిణ భారత భాషలు, హిందీలో విడుదల కానుంది.
 
తారాగణం: వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా, జయప్రకాష్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లికి నో చెప్పిందని కాలేజీ స్టూడెంట్‌పై కత్తితో దాడి... ఎక్కడంటే?

తిరుపతి: స్విగ్గీలో ఆర్డర్ చేసిన బిర్యానీలో బొద్దింకలు.. షాకైన కస్టమర్

ఆగ్రా సమీపంలో కుప్పకూలిన మిగ్-29 యుద్ధ విమానం

క్రాకర్స్‌తో ఛాలెంజ్.. ఆటో గిఫ్ట్.. సరదా కోసం వెళ్లి ప్రాణాలు బలి (video)

మొన్న దీపావళి పండుగ.. నేడు పుట్టినరోజు.. దువ్వాడకు మాధురి సూపర్ గిఫ్ట్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

వెల్లుల్లి చట్నీ ఎందుకు తినాలో తెలుసా?

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments