Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీడియాకి షాక్ ఇచ్చిన శైల‌జారెడ్డి అల్లుడు..!

అక్కినేని నాగచైతన్య నటించిన తాజా చిత్రం శైలజారెడ్డి అల్లుడు. యువ ద‌ర్శ‌కుడు మారుతి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికగా నటించారు. ప్రముఖ నటి రమ్యకృష్ణ శైలజారెడ్డి పాత్రను పోషించడం.. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా రిలీజ్

Webdunia
శనివారం, 15 సెప్టెంబరు 2018 (11:50 IST)
అక్కినేని నాగచైతన్య నటించిన తాజా చిత్రం శైలజారెడ్డి అల్లుడు. యువ ద‌ర్శ‌కుడు మారుతి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికగా నటించారు. ప్రముఖ నటి రమ్యకృష్ణ శైలజారెడ్డి పాత్రను పోషించడం.. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కావ‌డంతో భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అయితే.. సినీ విమ‌ర్శ‌కులకు ఈ సినిమా అంత‌గా న‌చ్చ‌లేదు. దీంతో ఈ సినిమాకి నెగిటివ్ రివ్యూస్ వ‌చ్చాయి. సినీ విశ్లేష‌కులు శైల‌జారెడ్డి అల్లుడు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే అనుకున్నారు.
 
అయితే.. మీడియాకి షాక్ ఇచ్చేలా రికార్డు స్థాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తున్నాడు శైల‌జారెడ్డి అల్లుడు. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.6.93 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు వెల్లడించారు. నాగ చైతన్య కెరీర్‌లో తొలి రోజున అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రమిదేనని అంటున్నారు. అంతేకాకుండా ఈ సంవ‌త్స‌రంలో తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లతో ప్రారంభమైన చిత్రాల్లో శైలజారెడ్డి అల్లుడు ఒకటి కావ‌డం విశేషం. ఫ‌స్ట్ డే 12 కోట్లు గ్రాస్ వ‌సూలు చేయ‌డం మ‌రో విశేషం.
 
నైజాం: రూ.2.50 కోట్లు, సీడెడ్‌: రూ.1.04 కోట్లు, యూఏ: రూ.82 లక్షలు, తూర్పు గోదావరి: రూ.72 లక్షలు, పశ్చిమ గోదావరి: రూ.42 లక్షలు, కృష్ణా: రూ.40 లక్షలు, నెల్లూరు: రూ.23 లక్షలు, గుంటూరు: రూ.80 లక్షలు,మొత్తం ‌: రూ.6.93 కోట్లు షేర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసాడు. అది కూడా నెగిటివ్ టాక్‌తో. ఇక హిట్ టాక్ వ‌చ్చుంటే ఎలా ఉండేదో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Suitcase: భార్యను కత్తితో పొడిచి.. మృతదేహాన్ని మడతపెట్టి ట్రాలీ బ్యాగులో కుక్కిన టెక్కీ.. ఆపై జంప్!

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments