Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫస్ట్ లుక్‌లో ఇరగదీసిన "శైలజారెడ్డి అల్లుడు"

అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని నాగచైతన్య హీరోగా, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం "శైలజారెడ్డి అల్లుడు". ఈ చిత్రంలో శైలజారెడ్డి పాత్రను సీనియర్ నటి రమ్యకృష్ణ పోషిస్తోంది. ఈ చి

Webdunia
సోమవారం, 9 జులై 2018 (13:27 IST)
అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని నాగచైతన్య హీరోగా, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం "శైలజారెడ్డి అల్లుడు". ఈ చిత్రంలో శైలజారెడ్డి పాత్రను సీనియర్ నటి రమ్యకృష్ణ పోషిస్తోంది. ఈ చిత్రం యూత్‌ను.. మాస్‌ను.. ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తున్నారు.
 
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను కొద్దిసేపటి క్రితం చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో శైలజా రెడ్డిగా కీలకమైన పాత్రను రమ్యకృష్ణ పోషించారు. కథలో ఆమె పాత్రకి గల ప్రాధాన్యత కారణంగానే ఫస్టులుక్ పోస్టర్‌లోనూ ఆమెను హైలైట్ చేశారు.
 
కథలో ప్రధానంగా కనిపించే మూడు పాత్రలను కవర్ చేస్తూ ఈ ఫస్టులుక్ పోస్టర్‌ను డిజైన్ చేశారు. చైతూ, అనూ ఇమ్మాన్యుయేల్ హ్యాపీ మూడ్‌లో వుంటే, అది తట్టుకోలేకపోతున్న ఎక్స్‌ప్రెషన్‌తో రమ్యకృష్ణ కనిపిస్తోంది. 
 
ఒకప్పుడు పొగరుబోతు అత్త పాత్రలను వాణిశ్రీ అద్భుతంగా పండించారు. ఇప్పుడు ఆ స్థానంలో రమ్యకృష్ణ అదరగొట్టేయనున్నారన్న మాట. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)

Couple: బైకుపై అంకుల్-ఆంటీల రొమాన్స్.. హగ్గులు, కిస్సులతో ఈ లోకాన్ని మరిచిపోయారు.. (video)

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కోర్టులో చుక్కెదురు

Cobra-బీహార్‌లో షాకింగ్ ఘటన: నాగుపామును కొరికి చంపేసిన బుడ్డోడు!

పనస పండు తిన్న ఆర్టీసీ బస్ డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ ‌టెస్టులో ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments