Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్ర‌స్టింగ్ ట్యాగ్ లైన్‌తో వ‌స్తోన్న మెగా హీరో..!

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ - ఎ.క‌రుణాక‌ర‌న్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న‌ చిత్రం తేజ్ ఐ ల‌వ్ యు. ఇందులో తేజ్ స‌ర‌స‌న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తోంది. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ అధినేత కె.ఎస్.రామారావు నిర్మిస్తోన్న ఈ సినిమా త్వ‌ర‌లో ప్రేక్ష‌కు

Webdunia
శుక్రవారం, 15 జూన్ 2018 (18:44 IST)
మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ - ఎ.క‌రుణాక‌ర‌న్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న‌ చిత్రం తేజ్ ఐ ల‌వ్ యు. ఇందులో తేజ్ స‌ర‌స‌న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తోంది. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ అధినేత కె.ఎస్.రామారావు నిర్మిస్తోన్న ఈ సినిమా త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా త‌ర్వాత తేజ్ నేను శైల‌జ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోన్న ఈ మూవీని త్వ‌ర‌లో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. 
 
ఈ చిత్రానికి చిత్ర‌ల‌హ‌రి అనే టైటిల్ ఖ‌రారు చేసారు. అయితే... చిత్ర‌ల‌హ‌రి అంటే... క్లాస్ టైటిల్‌లా అనిపిస్తుంది అనుకున్నారో లేదా ఆడియ‌న్స్‌ని  బాగా ఆకట్టుకునేలా ఇంకా ఏదో కావాలి అనుకున్నారో ఏమో కానీ... దీనికి బార్ & రెస్టారెంట్ అనే ట్యాగ్ లైన్ ఫిక్స్ చేసార‌ట‌. జులై నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
కిషోర్ తిరుమ‌ల ఇటీవ‌ల తెర‌కెక్కించిన ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. దీంతో యూత్‌కి బాగా క‌నెక్ట్ అయ్యేలా స్టోరీ రెడీ చేసాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఎప్పుడు ప్రారంభించేది అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేస్తార‌ని స‌మాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతున్న జంట, భూకంపం ధాటికి ప్రాణభయంతో పరుగు (video)

PM Modi: ప్రపంచ దృష్టంతా భారత్ పైనే ఉంది: వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో ప్రధాని మోదీ

పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయం చేయలేం.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments