Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిపల్లవిపై కన్నేసిన స్టైలిష్ స్టార్

Webdunia
మంగళవారం, 5 జనవరి 2021 (17:39 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. లెక్కల మాస్టారు కె.సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఓ హీరోయిన్‌గా రష్మిక మందన్నాను తీసుకున్నారు. మరో హీరోయిన్‌ (హీరోకు చెల్లి)గా సాయిపల్లవి పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. 
 
నిజానికి సాయిపల్లవి అంత ఈజీగా సినిమాలు అంగీకరించరు. ఒక సినిమాకు పచ్చజెండా ఊపేముందు చాలా ఆలోచిస్తుంది. తన పాత్ర నచ్చకపోతే ఏమాత్రం మొహమాటం లేకుండా నో చెప్పేస్తుంది. అందుకే, ఆమెను ఒక సినిమాలో బుక్ చేయడం అంత ఈజీ కాదు. అలాంటి సాయిపల్లవి తాజగా అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాలో ఓ కీలక పాత్ర చేయడానికి ఒప్పుకుందంటూ టాలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది.
 
ఇప్పుడీ చిత్రంలోనే సాయిపల్లవి నటించడానికి ఓకే చెప్పిందని అంటున్నారు. పైగా, ఈ చిత్రంలో ఆమె హీరోకి చెల్లిగా నటిస్తుందని, ఇది చాలా కీలక పాత్ర అనీ ప్రచారం జరుగుతోంది. మరి, ఓపక్క ఇతర సినిమాలలో కథానాయికగా నటిస్తున్న సాయిపల్లవి.. ఇలా హీరోకి చెల్లిగా నటిస్తుందా? ఆ పాత్రలో అంత విషయం వుందా? అన్నది త్వరలో వెల్లడవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments