Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుకోని అతిథిగా వస్తున్న ఫిదా బ్యూటీ...

Webdunia
బుధవారం, 16 అక్టోబరు 2019 (15:47 IST)
మళయాలం ప్రేమం మూవీతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాయి పల్లవి, ప్రేమ చిత్రంతో అందరి దృష్టి తనపై పడేలా చేసింది. తరవాత తెలుగులో ఫిదా చిత్రంతో అందర్నీ ఫిదా చేసిన సాయి పల్లవి.. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయింది. కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా యూట్యూబ్‌‌‌లో కూడా ఈ భామ హల్‌‌చల్ చేస్తుంది. రౌడీ బేబి, వచ్చిందే, ఏవండో నాని గారు పాటలతో యూట్యూబ్‌‌లో ట్రెండ్ సృష్టిస్తుంది.
 
ప్రస్తుతం ఈ బ్యూటీ మలయాళంలో నటించిన 'అతిరన్' చిత్రాన్ని తెలుగులోకి 'అనుకోని అతిథి' పేరిట అనువదిస్తున్నారు. మలయాళంలో 2019 ఏప్రిల్‌‌‌లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఫహాద్ ఫైజల్ హీరోగా ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రలలో సైకలాజికల్ థ్రిల్లర్‌‌గా దర్శకుడు వివేక్ తెరకెక్కించాడు.

కాగా తెలుగులో ఈ చిత్రాన్ని ఇంట్రోపీ ఫిలిమ్స్ బ్యానర్‌‌‌పై అన్నపురెడ్డి కృష్ణ కుమార్ మరియు గోవింద రవి కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో నవంబర్ 15న విడుదల చేయడానికి నిర్ణయించారట చిత్రబృందం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్

కుటుంబ తగాదాలే చిన్నారి హితీక్ష దారుణ హత్య

బ్రిక్స్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ : ఎందుకు?

Jyoti Malhotra: కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న జ్యోతి మల్హోత్రా.. వీడియో వైరల్

బీహార్ ప్రజల ఓటు హక్కులను లాక్కోవడానికి బీజపీ కుట్ర : కాంగ్రెస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments