Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

డీవీ
సోమవారం, 16 డిశెంబరు 2024 (17:58 IST)
Sai Durgathej as a warrior
మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ తన భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్  "సంబరాల ఏటిగట్టు"లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం సాయి దుర్గతేజ్ మేకోవర్ అయిన తీరు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది. రీసెంట్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన "సంబరాల ఏటిగట్టు" సినిమా కార్నేజ్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ వీడియోలో వారియర్ లాంటి ఫిజిక్ తో సాయిదుర్గ తేజ్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు.
 
స్ట్రిక్ట్ డైట్, ఎక్సర్ సైజ్ తో ఈ సినిమా క్యారెక్టర్ కు తగినట్లు మారిపోయారు సాయిదుర్గ తేజ్. ఈ ఇంటెన్స్ యాక్షన్ సినిమాకు, తన క్యారెక్టర్ కు వందశాతం న్యాయం చేసేందుకు సుప్రీమ్ హీరో పెడుతున్న ఎఫర్ట్స్ ను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. సంబరాల ఏటిగట్టు కార్నేజ్ చూస్తే ఈ సినిమాతో సాయి దుర్గతేజ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారో తెలుస్తోంది.
 
సంబరాల ఏటిగట్టు చిత్రాన్ని సాయిదుర్గ తేజ్ 18వ చిత్రంగా నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి  ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు రోహిత్ కేపీ రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 25న సంబరాల ఏటిగట్టు సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

58వ ఎజిఎం-66వ జాతీయ సింపోజియం 2025ను ప్రారంభించిన మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘేల్

టీవీ సీరియల్ చూస్తూ భర్తకు అన్నం పెట్టని భార్య, కోప్పడినందుకు పురుగుల మందు తాగింది

Women Entrepreneurship: మహిళా వ్యవస్థాపకతలో అగ్రగామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్

Sharmila: జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీ దత్తపుత్రుడు.. వైఎస్ షర్మిల ఫైర్

నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ- రూ.5,000 కోట్ల ఆర్థిక సాయంపై విజ్ఞప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments