ఆధ్యాత్మిక థ్రిల్లర్.. సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది..

Webdunia
శుక్రవారం, 14 ఆగస్టు 2020 (15:30 IST)
Sai Dharam Tej
మెగా మేనల్లుడు సాయి ధరమ్ రూటు మార్చాడు. తేజ్ కథలను ఎంచుకోవటంలో కాస్త కొత్తగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజు పండగే సినిమా తరువాత మళ్ళీ కమర్షియల్ కథలను పక్కన పెట్టాడు. ఇప్పుడు సోలో బ్రతుకే సో బెటర్ అంటూ ఒక కొత్త టైప్ లవ్ స్టోరీని టచ్ చేస్తున్నాడు.
 
తాజాగా మరో ప్రయోగాత్మక చిత్రంలో నటుస్తున్నాడు ఈ మెగా హీరో. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ మిస్టిక్ థ్రిల్లర్ లో నటించనున్నాడు. ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండడం విశేషం. సాయితేజ్‌కు ఇది 15వ చిత్రం. 
 
ఈ సినిమాకు బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో రిలీజైంది. పోస్టర్ చూస్తుంటే ఏదో తాంత్రిక శక్తులకు సంబంధించిన కథాంశం అని అర్థమవుతోంది. 
 
దీనిపై తేజ్ స్పందిస్తూ.. ''న్యూ జోనర్ ట్రై చేయడం ఎల్లప్పుడూ ఎగ్జైటింగ్‌గా ఉంటుంది.. అది కూడా నా ఫేవరేట్ మూవీ మేకర్ సుకుమార్ సహకారంతో ఇది మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఇది ఒక ఆధ్యాత్మిక థ్రిల్లర్'' అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దుర్గాపూర్ వైద్య విద్యార్థినిపై అత్యాచారం : బాధితురాలి స్నేహితుడు అరెస్టు

గోవా మాజీ ముఖ్యమంత్రి రవి నాయక్ ఆకస్మిక మృతి

ఈశాన్య రుతుపవనాలు ప్రారంభం - ఏపీకి పొంచివున్న తుఫానుల గండం

56 మంది పురుషులు - 20 మంది మహిళలతో రేవ్ పార్టీ ... ఎక్కడ?

Pawan Kalyan: కాకినాడ సెజ్ రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments