Webdunia - Bharat's app for daily news and videos

Install App

సి-స్పేస్ ద్యారా టాలెంట్ ఉన్న టీం చేసిన సగిలేటికథ చాలా కిక్ ని ఇచ్చింది : నవదీప్'

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2023 (11:54 IST)
Ravi Mahadasyam, Vishika Laxman, Rajasekhar Sudmoon, Navdeep
రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘సగిలేటి కథ. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రాజశేఖర్‌ సుద్మూన్‌ దర్శకత్వం వహించారు. హీరో నవదీప్‌ సి-స్పేస్ సమర్పణలో, షేడ్‌ ఎంటర్టైన్మెంట్‌, అశోక్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో దేవీప్రసాద్‌ బలివాడ, అశోక్‌ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయ్యిన ట్రైలర్, సాంగ్స్ కి ప్రేక్షకుల నుండి అశేష ఆధరణ లభించింది. ఈ బుధవారం, హీరో నవదీప్ ఆధ్వర్యంలో 'ప్రీమియర్ షో' ప్రదర్శించారు. 
 
అనంతరం హీరో నవదీప్ మాట్లాడుతూ: ప్రతి ఒక్కరి జీవితంలో లైఫ్ జర్నీ అనేది సాఫీగా సాగదు. ప్రతి వ్యక్తి కింద నుంచి పైకి రావాలిసిందే. అలా పైకి వెళ్లిన వ్యక్తులు, కింద నుంచి పైకి రావాలి అనుకునే వాళ్ళని చెయ్యి అందిందామని ఆలోచనతో తీసుకున్న ఈ నిర్ణయమే 'సగిలేటి కథ' సినిమా. టీమ్ అందరు చాలా కసి గా పని చేసారు. చాలా టాలెంట్ ఉన్న టీం మా  చిత్రం తో పరిచయమైనందుకు నాకు చాలా కిక్ ని ఇచ్చింది. ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని నమ్ముతున్నాను అన్నారు.
 
డైరెక్టర్ రాజశేఖర్ సుద్మూన్: నేను తొమ్మిది సంవత్సరాలు నుంచి సినిమా ఫీల్డ్ లో ఉన్నాను. కేరీర్ మొదట్లో సినిమాకి వెళ్తాను అని తోటి వ్యక్తులకి చెప్పగానే, అడ్రస్ లేకుండా పోతావ్ అన్నారు. ఇప్పుడు చెప్తున్నాను, నా అడ్రస్ సి స్పెస్, పిన్ కోడ్ నవదీప్. ఈ సినిమా ఈ రేంజ్ కి రావడం కేవలం నవదీప్. నేను చేసిన ఈ సినిమా జర్నీ మొత్తం లో మొదటి నుంచి నాకు సపోర్ట్ గా నిలిచిన వ్యక్తి మా హీరో రవి మహాదాస్యం. ఈ సినిమా సక్సెస్ అయ్యితే ఫిఫ్టీ పర్సెంట్ క్రెడిట్ మా హీరో కి దక్కుతుంది. ఫెయిల్ అయ్యితే, అది నాకు దక్కుతుంది 
 
ప్రొడ్యూజర్ దేవీప్రసాద్ మాట్లాడుతూ: మా చిత్రం 'చిన్న మూవీ' అనే పిలుపు తో స్టార్ట్ అయ్యి, 'పెద్ద మూవీ' అని గర్వంగా చెప్పుకునే విధంగా చేసింది. ఒకే ఒక వ్యక్తి, సి స్పెస్ ఫౌండర్ హీరో నవదీప్. మా సినిమా ఎండింగ్ లో పార్ట్ 2 అని పెట్టడానికి కారణం, సినిమా హిట్ అని బలంగా నమ్మడం. రాయలసీమ బ్యాక్డ్రాప్ లో తీసిన ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను.
 
హీరో రవి మహాదాస్యం మాట్లాడుతూ, ఈ సినిమాకి ప్రధాన బలం 'నవదీప్' గారు. ఈ సినిమా రాయలసీమ బ్యాక్డ్రాప్ లో అన్ని రకాల ఎమోషన్స్ ని పండించాం. అన్నారు.  హీరోయిన్ విషిక లక్ష్మణ్ మాట్లాడుతూ, రియల్ లైఫ్ లో నేను చేసిన కృష్ణమ్మా క్యారెక్టర్ చాలా దగ్గర గా ఉంటుంది అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మెరుపు వేగంతో రోడ్డుపై యువకుడిని ఢీకొట్టిన బైక్, నడిపే వ్యక్తి మృతి (Video)

సకల వర్గాల ప్రజల మేలు కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూర్యారాధన

రాయలసీమకు వస్తోన్న టెస్లా.. చంద్రబాబు ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా?

తెలంగాణ పీసీసీ రేసులో చాలామంది వున్నారే.. ఎవరికి పట్టం?

అంగన్‌వాడీ టీచర్‌ నుంచి శాసన సభ్యురాలిగా ఎదిగిన శిరీష.. స్టోరీ ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments