Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విల్‌ పవరే ఆయన్ను త్వరగా కోలుకునేలా చేసింది: కమల్‌ను ఓ రేంజిలో పొగిడేస్తున్న శ్రుతి

తన తండ్రి కమల్ హసన్‌కి ప్రమాదం జరిగినప్పుడు వణికిపోయానని, కానీ తన మనోబలంతోనే ఆయన త్వరగా కోలుకున్నారని కమల్ తనయ శ్రుతి హసన్ చెప్పారు.

Webdunia
శనివారం, 4 మార్చి 2017 (01:49 IST)
తన తండ్రి కమల్ హసన్‌కి ప్రమాదం జరిగినప్పుడు వణికిపోయానని, కానీ తన మనోబలంతోనే ఆయన త్వరగా కోలుకున్నారని కమల్ తనయ శ్రుతి హసన్ చెప్పారు. నాకు తెలిసి వేరే ఎవరైనా అయితే ఇంత త్వరగా కోలుకుని ఉండేవారు కాదు. నాన్నగారిలో ఉన్న సంకల్పసిద్ధిని ఇంతవరకు ఎవ్వరిలోనూ చూడలేదు. ఆ విల్‌ పవరే ఆయన్ను త్వరగా కోలుకునేలా చేసింది అంటున్నారీమె. 
 
‘‘మా నాన్నగారు వెరీ స్ట్రాంగ్‌. ఆయనకు జరిగిన ప్రమాదం నుంచి  కోలుకోవడానికి చాలా నెలలు పడుతుందనుకున్నా. కానీ, చాలా త్వరగా కోలుకుంటున్నారు. అంతా మేజిక్‌లా అనిపిస్తోంది. త్వరలో ‘శభాష్‌ నాయుడు’ షూటింగ్‌ మొదలుపెడతాం’’ అని శ్రుతీహాసన్‌ అన్నారు. దాదాపు ఏడు నెలల క్రితం కమల్‌హాసన్‌ ఇంట్లో పడిపోయిన విషయం, అప్పుడు ఆయన కాలు ఫ్రాక్చర్‌ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన దాదాపు రికవర్‌ అయ్యారు.
 
ఈ సందర్భంగా శ్రుతీహాసన్‌ మాట్లాడుతూ – ‘‘వాస్తవానికి నాన్నగారికి ప్రమాదం జరిగినప్పుడు నేను ఇండియాలో లేను. ఫోన్‌లో చెప్పారు. వినగానే చాలా బాధపడ్డాను. ఇండియా వచ్చాక ఆయన పరిస్థితి చూసి, కంగారుపడ్డాను. నాకు తెలిసి వేరే ఎవరైనా అయితే ఇంత త్వరగా కోలుకుని ఉండేవారు కాదు. నాన్నగారిలో ఉన్న సంకల్పసిద్ధిని ఇంతవరకు ఎవ్వరిలోనూ చూడలేదు. ఆ విల్‌ పవరే ఆయన్ను త్వరగా కోలుకునేలా చేసింది. నేను, నాన్న తండ్రీ కూతుళ్లుగా నటిస్తోన్న ‘శభాష్‌ నాయుడు’ షూటింగ్‌కి బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే. త్వరలో మళ్లీ చిత్రీకరణ మొదలుపెడతాం’’ అన్నారు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్కాపురం రైల్వే స్టేషన్‍‌లో నరకయాతన అనుభవించిన ప్రయాణికులు...

యువతిని నగ్నంగా వీడియో తీసిన వ్యక్తి అంతలోనే శవమయ్యాడు... ఎలా?

కెనడా - మెక్సికో - చైనాలకు షాకిచ్చిన డోనాల్డ్ ట్రంప్!!

కాలేజీ బాత్రూమ్‌లో విద్యార్థిని ప్రసవం.. యూట్యూబ్‌ వీడియో చూసి బొడ్డు కత్తిరింపు

బాలానగర్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు సజీవదహనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

తర్వాతి కథనం
Show comments